దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచిన విషయం కూడా తెలిసిందే. అయితే ఎన్నిక ముగిసినా కానీ ఇంకా టీఆర్ఎస్, బీజేపీ పార్టీ మధ్య దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో లడాయి ఇంకా సమసిపోలేదు. నిన్నటి వరకు నియోజకవర్గంలో సాగిన పంచాయితీ ఇప్పుడు అది కాస్త హైకోర్టుకు చేరింది. దుబ్బాక ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, తనిఖీల నడుమ సాగిన ఎన్నికలు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలోనే సిద్ధిపేటలో రఘునందన్‌రావు మామ ఇంట్లో పోలీసుల తనిఖీలు కలకలం సృష్టించింది. చివరకు దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1118 ఓట్ల మెజారిటీతో రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిదే.
అయితే దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. దుబ్బాక ఎన్నికల సమయంలో జరిగిన ఓ ఘటనపై ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు. సిద్ధిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ రఘునందన్‌రావు కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో రూ.18 లక్షలు లభించాయంటూ పోలీసులు కట్టుకథ అల్లారని ఆయన పిటిషన్‌లో వెల్లడించారు.
అయితే ఆయన వేసిన క్వాష్ పిటిషన్ జస్టీస్ లక్ష్మణ్ బెంచ్ వద్ద విచారణకు వచ్చింది. దీంతో ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని జస్టీస్ చెప్పారు. ఈక్రమంలో రఘునందన్ రావు వేసిన పిటిషన్‌ను సీజే ధర్మాసానికి బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చారు.