టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘మోడీ మెడ వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్, హోదాను మోదీ వద్ద తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం అన్నారు. బీజేపీ పుదుచ్చేరి కి ప్రత్యేక హోదా ఇస్తామంటోంది, మరైతే ఏపీకి హోదా ముగిసిన అధ్యాయమేనా అన్నారు. బీజేపీతో రహస్యంగా దోస్తీ చేస్తూ, పుదుచ్చేరి లో బీజేపీ గెలుపు కోసం వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని వాఖ్యలు చేశారు. ‘‘మీ కేసుల గురించి కాకుండా, కాస్త ప్రత్యేక హోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి’’ అని అన్నారు. టీడీపీ నాయకులు లోకేశ్, అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్ల పట్ల నెటిజన్స్ బాగా స్పందిస్తున్నారు.
Also Read:న్యాయమే గెలుస్తుంది : వైసీపీ కుట్రలపై నారా లోకేశ్ ట్వీట్
మోదీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందో?(1/2) pic.twitter.com/0d4YQRypzd
— Lokesh Nara (@naralokesh) April 1, 2021











