జగన్ రెడ్డికి కట్టుపడితే చరిత్ర హీనులవుతారు..
జగన్ రెడ్డి నిర్ణయాలకు కట్టుపడి, జిల్లాల పునర్విభజకు వైసీపీ ప్రజాప్రతినిధులు ఒకే అంటే.. నియోజకవర్గాల్లో వారి చీటిని ప్రజలు చింపేస్తారు. ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా, జిల్లాకు దూరంగా ఉన్న ప్రాంతాలకు పాలన సౌలభ్యం, సత్వర సేవలు అందుచేందుకు ప్రజా బాహుళ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభన చేయడం సమంజసం! అటువంటి ప్రాధాన్యత ప్రాతిపదికన కాకుండా రాజకీయ స్వాప్రయోజనాల కోసం ఏపిలోని 25 పార్లమెంట్ స్థానాలను 26 జిల్లాలుగా మీకిష్టమొచ్చినట్లు విభజించి, వాటిని అమలు చేస్తాం అంటే ప్రజలు ఎలా ఊరుకుంటారు? ఇప్పుడు బాహాటంగా వ్యతిరేకించకపోయినప్పటికీ.. వైసీపీ ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఎన్నికల్లో దెబ్బకొట్టక మానరు! ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు!! రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు విభజనతో నష్టపోతున్నాం.. ప్రజాభిప్రాయ సేకరణ, చర్చలు, సమాలోచనలు జరిపిన తరువాతే అంతిమంగా జిల్లాల పునర్విభజన జరగాలి. గతంలో తెలంగాణాలో అలా జరిగింది కాబట్టే ఉన్న 10 జిల్లాలు కాస్తా 33 జిల్లాలుగా విభజన జరిగి.. ఎటువంటి రచ్చా, చర్చా లేకుండా కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. కానీ ఇదెక్కడి దౌర్భగ్యమోకానీ, ప్రజల ఓట్లతో గద్దెనెక్కి.. ప్రజాస్వామ్యానికి మోహం చూపకుండా ప్యాలెస్ నుంచి పాలన సాగిస్తాను.. తనకు నచ్చిన నిర్ణయాలు మొండిగా తీసుకుంటాను అనే ముఖ్యమంత్రి జగన్ రూపంలో దొరకడం చేసుకున్న పాపం అని ప్రజలు మండిపడుతున్నారు! జిల్లాలను అశాస్త్రీయంగా, ప్రజల డిమాండ్స్‌ను లక్ష్యపెట్టకుండా విభజన చేస్తారో.. ఆ జిల్లాలో అధికార వైసీపీ ఓటు బ్యాంక్ గల్లంతై.. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాజీలుకాక తప్పదు అన్నది ఇప్పటికైనా గుర్తించాలి! అందరి ఆమోదయోగ్యంతోనే జిల్లాల పునర్విభజ ప్రక్రియ పూర్తయితే ఎటువంటి వివాదాలు తావుండదని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది!
Must Read:-సీఎం జగన్ తో అలీ భేటీ! అందుకేనా?
సొంతపార్టీ నేతల వినతులు కూడా వినరా?
కొత్త జిల్లాల విభజనతో నష్టపోతున్నాం.. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్విభజన జరగాలని రాష్ట్ర ప్రజలతో పాటు విపక్షాలు మొత్తుకుంటున్నాయి. అయినా వారి అభ్యర్థనలను తోసిపుచ్చుతూ జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. చివరికి సొంతపార్టీ నేతలే ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో రోడ్డెక్కి కొత్త జిల్లా పునర్విభజనకు వ్యతిరేకంగా నినదించారు. దీనిపై నేటికీ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు! కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ( పల్నాడు ), కృష్ణా, ప.గో, విజయనగరం జిల్లాలో జిల్లాలా పునర్విభజనపై నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి నుంచి నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ నేతలు జగన్ రెడ్డి నిర్ణయాలపై మండిపడుతున్నారు.నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కొత్త జిల్లా అంశపై తన స్వరం మార్చారు. ఒకప్పుడు రాష్ట్రం, నియోజకవర్గాల విభజనతో పూర్తిగా నష్టపోయాం.. నేడు జిల్లా పునర్విభజనతో నష్టపోవడానికి సిద్ధంగా లేమని ఎమ్మెల్యే ఆనం తేల్చి చెప్పారు! నెల్లూరు జిల్లాలోనే రావూరు, కలువాయిని సాగించాలని ఆయన గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. వెంకటగిరి నియోకవర్గాన్ని బాలజీ జిల్లాలో కలపడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆనం అవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో స్వార్థరాజకీయ ప్రయోజనాల కారణంగా అప్పట్లో ఓ కాంగ్రెస్ నాయకుడు రావూరు, కలువాయి వాసులకు తీరని ద్రోహం చేశారని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ లాంటి దుస్థితి సోమశిల ప్రాజెక్ట్ కు పట్టకూడాదని ఆకాంక్షించారు. ఇప్పటికైనా అశాస్త్రీయంగా జరగుతున్న పునర్విభజన పునారాలోచించకుంటే.. ప్రజా ఉద్యమం కార్యరూపం దాల్చక తప్పదన్నారు. వెంకటగిరిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఆనం డిమాండ్ చేస్తున్నారు!
Must Read:-ఉద్యోగుల ఆశలపై జగన్ ప్రభుత్వం నీళ్లు..! వాట్ నెక్స్ట్..?











