సవాంగ్ పై ఉన్న ప్రేమే.. ఆ పని చేయిందా?
ఏపీ మాజీ డిజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మొన్న ఉత్తర్వులు విడుదల చేసింది. దీనిని వేటుపడిందని మీడియా అంతా రాసుకొచ్చింది. నిన్న కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిందని సాక్షి పత్రిక ఒక కథనం రాసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంతా బాగానే ఉంది.. అయితే రెండ్రోజుల పాటు సవాంగ్ ను అలా ఉంచి, గురువారం సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉదయం ప్రకటన విడుదల చేసింది! దీంతో ఇదేక్కడి కొత్త ట్విస్ట్ రా.. రెడ్డిగారు అని అందరూ నోటి మీద వేలేసుకున్నారు. వాస్తవానికి ఐపీఎస్ గా కొనసాగుతున్న వ్యక్తిని రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చోపెట్టడం ఏమిటని సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
చట్టప్రకారం నియామకం చెల్లదు?
ఇండియన్ పోలీస్ సర్వీసులో విధులు నిర్వర్తిస్తున్న ఒక అధికారిని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోకి ఎలా మారుస్తారు? అన్నదే ఇక్కడ ప్రశ్న! రాజ్యంగబద్ధమైన ఆ పదవిని స్వీకరించాలంటే విశ్రాంత ఐఏఎస్లు, ఐపీఎస్ లు, ఇతర ప్రభుత్వ సెక్టర్ లోని ఉన్నత పదవుల్లో విధులు నిర్వర్తించిన వ్యక్తులకు ఎపీపీఎస్సీ ఛైర్మన్ పదవులను కట్టబెడతారు. కొన్ని చోట్ల ఆయా ప్రభుత్వాలు సీనియర్ ఐఏఎస్ లను కూడా నియమిస్తుంటారు. కానీ ఏపీలో ఇందుకు విరుద్ధంగా ఒక ఐపీఎస్ ను ఈ పదవిలో తెచ్చి కూర్చోపెట్టడం ఎంతమేరకు సబబో ప్రభుత్వ పెద్దలే చెప్పాలని వినవస్తున్న విమర్శలు! ఇంకా గౌతం సవాంగ్ కు మరో 17 నెలలు సర్వీసు కూడా ఉంది. అయితే సవాంగ్ పదవీ విరమణ చేసి ఉంటే, ఈ పదవిని స్వీకరించేందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. లేకుంటే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, సవాంగ్ ఈ బాధ్యతలు తీసుకున్నా.. ఎటువంటి విమర్శలు ఉండకపోవచ్చు. కాకపోతే ప్రభుత్వం నిర్ణయించింది.. అధికారి పాటించాడు అన్న చందంగా సాగింది సవాంగ్ నియామకం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! ఏలిన మహాప్రభులకే ఎరుక అని సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారాయి!
Musdt Read:-అంతా దేవుడి దూతలదే.. అయ్యో గౌతమ్ సవాంగ్











