ఆరాచక పాలనకు నిరసలు..
కృష్ణాజిల్లా గుడివాడలో ప్రశ్నించే ప్రజలకు, బాధ్యతగా డ్యూటీ చేసే ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయింది! మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి ఎదుటనే విధుల్లో ఉన్న స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు పై దాడికి పాల్పడ్డారు వైసీపీ నాయకులు! ఇది కూడా మంత్రిగారి క్యాపు కార్యాలయం వేదికగా జరగడం గమనార్హం! గుడివాడలో ఓ థియేటర్ కి సంబంధించిన ఎన్ఓసీ ఇవ్వలేదనే కారణంతోనే కొట్టారని తహసీల్దార్ శ్రీనివాసరావు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ పై దాడికి పాల్పడ్డ మంత్రి నాని అనుచరుడు పద్మారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని రెవిన్యూ సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ పై జరిగిన దాడికి రెవిన్యూ సంఘాలు ఖండనలు తెలుపుతూ నిరసనలు తెలియజేశాయి. విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారులపై దౌర్జన్యం చేయడం, ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం మంచి పద్దతి కాదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత అధికారులపై ఇంత వివక్షా?
జగన్ రెడ్డి పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులను టార్గెట్ చేస్తూ.. సాగించిన దౌర్జన్యకాండ ప్రజలకు కళ్లకు కడుతోంది! జగన్ రెడ్డి నిరంకుశ పాలనలో దళితలకు రక్షణ కరువైంది అన్నది జరగుతున్న వరుస దాడులను బట్టి చూస్తే.. ప్రజలకు ఇట్టే అర్థమౌతుంది. నాడు డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వం సాగించిన వేదింపులు, ఆ తరువాత ఆయన పరిస్థితి ఏమైందో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు! ఆ కోవలోనే తహసీల్దార్ శ్రీనివాసరావుపై వేదింపులు మొదలయ్యాయి. సిన్సియర్ గా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసరావుపై పదేపదే ఒత్తిడి తీసుకొస్తూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సినిమా థియేటర్ కు అనుమతులివ్వమని బెదిరిస్తే.. అది కుదరదు అని చెప్పిన నేరానికి అధికార వైసీపీ నాయకుడు పద్మారెడ్డి దాడికి తెగపడ్డాడు. ఒక దళిత అధికారి అని కూడా చూడకుండా అధికార జులం ప్రదర్శించి, దాడిచేయడం ఎంత వరకు సబబు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. నిన్న విజయవాడలోని కృష్ణలంక పీఎస్ లో పోలీసులపై ఎంపీ నందిగం సురేష్, తన అనుచరులతో వెళ్లి దాడికి పాల్పడటం, నేడు తహసీల్దార్ పై దాడి చేయడం క్షమించరాని నేరమని లోకేశ్ మండిపడ్డారు.
Muat Read:-ముందుస్తుకు పోతే ముప్పు వైసీపీకే! తనగొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్!!











