ఈ ఏడాది ఐపీఎల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై జట్టుకు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కెప్టెన్ కూల్ ధోనీ.. తన నాయకత్వంలో చెన్నై జట్టుకు వందో విజయం అందించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై టీమ్ మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. చెన్నై జట్టు సమరోత్సాహంతో దూకుతుండగా.. రాజస్థాన్ మాత్రం కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో డీలా పడింది.
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జాస్ బట్లర్ క్వారంటైన్ పూర్తి కాకపోవడంతో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. అలాగే మరో కీలక ఆటగాడు బెన్ స్టోక్స్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. దీంతో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే రాజస్థాన్ బరిలోకి దిగుతోంది. మరి, ఈ నేపథ్యంలో చెన్నై జట్టును రాజస్థాన్ నిలువరించగలదో, లేదో చూడాలి. షార్జా స్టేడియంలో మంగళవారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
రాజస్థాన్ టీమ్ బలాలు
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న రాజస్థాన్ టీమ్‌కు కెప్టెనే ప్రధాన బలం. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా స్మిత్ సొంతం. ఇక, దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో `అండర్-19 వరల్డ్ కప్`లో అదరగొట్టిన యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌పై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. వరల్డ్‌కప్ ఫామ్‌నే యశస్వి కొనసాగిస్తే రాజస్థాన్ టీమ్‌కు భారీ అండ లభించినట్టే. ఇక, యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు కూడా ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. శ్రేయాస్ గోపాల్ రూపంలో మంచి ఆల్‌రౌండర్ అందుబాటులో ఉన్నాడు. జయదేవ్ ఉనద్కత్, జెఫ్రీ ఆర్చర్, మయాంక్‌తో బౌలింగ్ విభాగం ఫర్వాలేదనిపిస్తోంది.
బలహీనతలు
ఇంగ్లండ్‌కు ఈ ఏడాది వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్, స్ట్రోక్ ప్లేయర్ జాస్ బట్లర్ అందుబాటులో లేకపోవడం రాజస్థాన్ టీమ్‌కు పెద్ద లోటు. స్మిత్ తప్ప అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టులో లేకపోవడం కూడా రాజస్థాన్‌కు మైనస్. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తున్నాయి. దాన్ని క్యాష్ చేసుకునే మెరుగైన స్పిన్నర్ రాజస్థాన్ జట్టులో లేడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు (అంచనా)
స్టీవ్ స్మిత్, రాబిన్ ఊతప్ప, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, మనన్ వోహ్రా, ఆండ్రూ టై, శ్రేయాష్ గోపాల్, జొఫ్రా ఆర్చర్, మయాంక్ మర్కండే, జయదేవ్ ఉనద్కత్.
చెన్నై సూపర్ కింగ్స్ బలాలు
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైను సునాయాసంగా ఓడించడంతో చెన్నై జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ముఖ్యంగా అంబటి రాయుడు, డుప్లెసిస్ ఫామ్‌లోకి రావడం జట్టుకు ఊరటనిచ్చే అంశం. ఇక, బౌలింగ్ విభాగంలో అందరూ సమష్టిగా రాణించారు. ఎప్పటిలాగానే ధోనీ నాయకత్వం ఆ టీమ్‌కు కొండంత బలం. జట్టులో ఎక్కువ మంది సీనియర్లే ఉన్నప్పటికీ, కొంతకాలం పాటు మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ అందరూ టచ్‌లోనే ఉన్నారు.
బలహీనతలు
హార్డ్ హిట్టర్లుగా పేరు తెచ్చుకున్న విజయ్, వాట్సన్ ఫామ్‌లోకి రావడం చెన్నైకి అత్యవసరం. తొలి మ్యాచ్‌లో చెన్నై ఫీల్డింగ్ చాలా పేలవంగా సాగింది. టీ-20 మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్ అత్యంత కీలకం. కాబట్టి ఆ విభాగంపై చెన్నై దృష్టి పెట్టాల్సి ఉంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లో అంచనాల మేరకు రాణించలేకపోడు. ఏకంగా 10.75 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు.
చెన్నై జట్టు (అంచనా): షేన్ వాట్సన్, మురళీ విజయ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ, శ్యామ్ కర్రన్, జడేజా, డ్వేన్ బ్రావో, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, ఎంగిడీ.
మ్యాచ్ ఫేవరెట్
తొలి మ్యాచ్‌లాగానే ఈ మ్యాచ్‌లోనూ ఆటగాళ్లందరూ సమష్టిగా రాణిస్తే రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నె జట్టు సునాయాసంగా విజయం సాధిస్తుంది. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం రాజస్థాన్‌కు పెద్ద మైనస్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సంజూ శాంసన్, జైస్వాల్‌లాంటి యువ ఆటగాళ్లు రాణిస్తే రాజస్థాన్ పోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది.










