సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలోని మూడో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” కారణంగా మహేష్ , త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం ఆలస్యం అయ్యింది. కాగా “సర్కారు వారి పాట” షూటింగ్ పూర్తి కావడంతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.అతడు, ఖలేజా తర్వాత చాలా కాలానికి మహేష్, త్రివిక్రమ్ లు కలిసి సినిమా చేస్తుండడమే ఇందుకు కారణం. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ‘పెళ్ళిసందడి’ సుందరి శ్రీలీల కూడా ప్రత్యేక పాత్రలో నటించబోతోందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మూవీకి మరింత గ్లామర్ పెంచే ఆలోచనతోనే దర్శకుడు త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తొలత ఈ సినిమా కోసం త్రివిక్రమ్, శ్రీలీలను సంప్రదించగా ఆమె ఆసక్తి చూపించలేదట. అయితే సినిమాలోని ఆమె పాత్రని, కొన్ని సన్నివేశాల్ని దర్శకుడు వివరించడంతో శ్రీలీల చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక మూవీలో మహేశ్, శ్రీలీలపై ఓ అదిరిపోయే డ్యూయెట్ ను కూడా ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. అంతేకాకుండా ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త మేకోవర్ తో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేయబోతున్నారని సమాచారం.ఈ మూవీలో మహేశ్ పాత్ర కూడా నెవర్ బిఫోర్ స్థాయిలో ఉండబోతోందట. ఇక చిత్రంలో మహేశ్ తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.