పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుందా ? ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి? లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల బయటపడే లక్షణాలు ఏమిటి ? పావురాల వ్యర్థాల అంశంలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
పావురాల రెట్టలకు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది అనే చెబుతున్నాయి పరిశోధనలు.ఈ అంశంపై 2016 మరియు 2018 మధ్య డాక్టర్ వారద్ పూణే నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలినట్లు సమాచారం. డాక్టర్ పూణే అధ్యయనంలో పావురం రెట్టలు అలెర్జీని కలిగిస్తాయని, ఆస్తమాకు దారితీస్తాయని ఆయన రూపొందించిన పరిశోధనా పత్రాల్లో పొందుపరచబడ్డాయి.
తన పరిశోధనా పత్రం కోసం, డాక్టర్ వారద్ పూణే ఐదు నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,100 కేసులను అధ్యయనం చేశారు.అందులో 37 శాతం మంది పిల్లలకు పావురం ఈకలు మరియు రెట్టల ద్వారా అలెర్జీ సోకినట్లు ఆయన గుర్తించారు.అంతేకాదు పావురం రెట్టలు ఉబ్బసం వంటి వ్యాధులకు దారితీస్తుందని ఈ అధ్యయనంలో ఆయన గుర్తించారు.
తాజాగా నటి మీనా భర్త విద్యాసాగర్ 48 ఏళ్ల వయసులోనే మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని కారణమని వైద్యులు పేర్కొన్నారు. కాగా, మీనా భర్తకు పావురాల వ్యర్ధాల ద్వారానే ఊపరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురై ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి? లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల ఎలాంటి లక్షణాలు బయటపడతాయి ? అనే దాని పై వైద్యులు ఈ విధంగా చెబుతున్నారు.. మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా.. ఊపిరితిత్తుల దిగువ భాగంలో ఎక్కువ కాలం పాటు భరించలేని ఛాతి నొప్పి లేదా వాపు ఉండడం, ఊపిరి పీల్చినప్పుడు దగ్గు వస్తుండడం ఇన్ఫెక్షన్ లక్షణాలట.అంతేకాదు దీర్ఘకాలిక కఫం కూడా అంటువ్యాధుల కారణంగా వస్తుందట. ఇది ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం వస్తున్నట్లయితే.. ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లేనట.
లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం వల్ల దగ్గు, చెస్ట్ పెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి, అలసట, ఆయాసం, చెమటలు వంటి రకరకాల లక్షణాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి.అందుకే లంగ్స్ ఇన్ఫెక్షన్‌ను నివారించుకోవడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే లంగ్స్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి.. పుదీనా టీ.లంగ్స్‌లో ఏర్పడిన ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందట.రోజుకు ఒక కప్పు పుదీనా టీ తీసుకుంటే..అందులో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్‌ను తొలగించడమే కాదు దగ్గు, ఛాతిలో నొప్పి, శ్వాస సమస్యలను సైతం దూరం చేస్తాయట.అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకుని పై పొట్టును తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి ఆ ముక్కలను డైరెక్ట్‌గా నమలడం కూడా మంచిదని..ఈ టిప్స్‌ను పాటిస్తే గనుక చాలా అంటే చాలా సులభంగా లంగ్స్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించుకోవచ్చని అంటున్నారు.
నిజానికి లంగ్స్ ఇన్ఫెక్షన్ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎందరినో వేధించే సమస్య అని.. దీని విషయంలో అశ్రద్ద వహించకుండా లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.