మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందు ఇప్పుడు రెండు ప్రధాన బాధ్యతలున్నాయి. ఒకటి.. తండ్రి చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను నిర్మిస్తూ.. అందులో తాను ఒక ప్రధాన పాత్ర పోషించాలి. రెండు జక్కన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాను కంప్లీట్ చేయాలి. ఈ రెండు సినిమాలూ పూర్తవ్వడానికి ఇంకా టైమ్ పడుతుంది. ముందుగా ‘ఆచార్య’ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కల్లా విడుదలకు సిద్ధం చేయాలి. ఇన్ని పనులతో తలమునకలై ఉన్న చెర్రీ.. తన తదుపరి సినిమాను ఇంకా కన్ఫామ్ చేయలేదు.
దానికి ఒకటే కారణం.. రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తర్వాత ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటున్నాడట. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎలాగూ పాన్ ఇండియా కేటగిరిలో విడుదలవుతుంది కాబట్టి.. ఈ సినిమాతో అతడి పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగుతుంది కాబట్టి.. ఆ తర్వాత సినిమాను అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీని కోసం కొన్ని కథలు విన్నా.. ఆ రేంజ్ లోని స్టోరీ ఇంకా అతడి కంటపడలేదట.
అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం రామ్ చరణ్ మదిలో ‘ధ్రువ’ సీక్వెల్ ఉందట. తన కెరీర్ లోనే ఒక మైలురాయిలాంటి సినిమా అది. అందుకే ఆ సినిమాకి సీక్వెల్ తీయాలన్నది రామ్ చరణ్ ఆలోచన. పాన్ ఇండియా సినిమాకి కావల్సిన అన్ని క్వాలిటీస్ ఆ కథలో ఉన్నాయి. ఇక ‘ఆర్. ఆర్. ఆర్’ మూవీ తర్వాత ప్రభాస్ తరహాలో ఇకపై అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేయాలని డిసైడయ్యాడట. మరి చెర్రీ పాన్ ఇండియా ఆలోచన ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.