రాష్ట్రంలో వైసీపీ నేతలు మహిళల ప్రాణాలు తీస్తుంటే జగన్ చోద్యం చూస్తున్నారని విరుచుకుపడ్డారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మహిళా రక్షణలో గన్ కంటే ముందుంటా అని చెప్పిన జగన్ వైసీపీ నేతలే మహిళల ప్రాణాలు తీస్తుంటే ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు.చిత్తూరు జిల్లా కొంగావారిపల్లిలో గాజుల వ్యాపారి రమణమ్మని వైసీపీ నేత వెంకట్రమణారెడ్డి అతిక్రూరంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకి పరాకాష్ట అని ఆయన విమర్శించారు. జగన్‌రెడ్డి దిశ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించి మహిళల భద్రతకి నాది భరోసా అని మాయమాటలు చెప్పి మూడురోజులు కాకముందే వైసీపీ నేత ఇటువంటి పాశవిక ఘటనకు పాల్పడడం పై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదేనా ముఖ్యమంత్రి మహిళలకు మీరిచ్చే భద్రత? అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది కబ్జాలు, దోపీడీలు, అడ్డుపడినవారిని చంపడానికి లైసెన్సు అన్నట్టు వైసీపీ నాయకులు దారుణాలకు తెగబడుతున్నారని లోకేష్ ఆరోపించారు.ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే అంతమొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుంటే..రాష్ట్ర ప్రజల ప్రాణాలకి దేవుడే దిక్కు అని ఆయన పేర్కొన్నారు.
బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే....