అక్రమాస్తుల కేసులో 11 ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌ను ఇవాళ విచారణకు స్వీకరించింది. గత వారమే బెయిల్ రద్దుపై పిటిషన్ వేసినా మరిన్ని వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించడంతో, రఘురామరాజు ఆ వివరాలను జత చేశారు. దీంతో సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. 18 నెలలుగా అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్నా కోర్టులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయో తెలియడం లేదని ఎంపీ రఘురామరాజు అభిప్రాయపడ్డారు. ఇలా జరిగితే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ఎంపీ ప్రశ్నించారు.
త్వరతగతిన కేసు విచారించండి
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసులను సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ఎంపీ రఘురామరాజు పిటీషన్‌లో విజ్ఙప్తి చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డపేరు రాకూడదనే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వేసినట్టు ఎంపీ స్పష్టం చేశారు. అనేక మంది తమ సీఎంపై నీలాపనిందలు వేస్తున్నారని అవి తనను ఎందో బాధిస్తున్నాయని, అందుకే జగన్ సీబీఐ కేసుల నుంచి బయటపడి కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆశిస్తున్నట్టు రఘురామరాజు అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా జగన్‌పై ఉన్న కేసులను తేల్చాలని అప్పుడే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Must Read ;- డబ్బు తీసుకోండి, వారికి ఓటు వేయవద్దు.. ఎంపీ రఘురామరాజు