ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ నేతలాగదాలు శృతి మించుతున్నాయి. ఒకవైపు పన్నుల భారంతో జగన్ సర్కార్ ప్రజలను పీడిస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ నాయకుల వేధింపులతో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు.స్థానిక ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని హత్యా రాజకీయాలు చేసిన వైకాపా శ్రేణులు,అధికారం చేతిలో ఉందని ఇప్పుడు మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు.టిడిపి ఓటు వేయడం ద్వారా తన ఓటమికి కారణమైన ఓ వ్యక్తి ఇంటిని ఏకంగా కబ్జా చేశాడు ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రభుద్ధుడు. ఈ ఘటణ కనిగిరి మండలంలో చోటుచేసుకుంది. కాగా , ఈ ఘటణ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మీ అరాచకాలు ఇంకెన్నాళ్లు జగన్ గారూ అని ఆయన ప్రశ్నించారు.
ఓటు వేయని వారిపై వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్ లు, హత్యలు చేయడం వంటివాటిని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చూశామని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి ఓటేసి తన ఓటమికి కారణమయ్యాడనే కక్షతో వారి ఇంటిని వైసీపీ నేత పోలయ్య కబ్జా చేశాడని మండిపడ్డారు.
అధికారం అండతో పోలయ్య ఇంటిని ఆక్రమించడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డిగారూ అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండని ట్విట్టర్ వేదికగా సూచించారు. దీంతోపాటు ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.