ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ ఎవరైనా ఉన్నారా అంటే.. మన జగ్గూ భాయ్ గురించే చెప్పుకోవాలి. హీరో నుంచి విలన్ గానూ, అక్కడ నుంచి కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ మారిన ఆయన .. ఇప్పుడు ఇంచుమించు అన్ని సౌత్ లాంగ్వేజెస్ లోనూ ప్రధాన పాత్రలు పోషిస్తూ దూసుకోవడం ఆశ్చర్యమనిపించకమానదు. చిన్నప్పుడు జగపతి బాబు చదువంతా మద్రాస్ లోనే సాగడంతో.. ఆయనకి తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన కమాండ్ ఉంది. అలాగే.. మిగిలిన దక్షిణాది భాషల్లో అంతో ఇంతో నాలెడ్జ్ ఉంది. అందుకే ఆయన నటనకి భాష ఎంత మాత్రం అడ్డు కావడం లేదు.
ప్రస్తుతం జగ్గూభాయ్.. తెలుగులో టక్ జగదీష్, పుష్ప, లక్ష్య, ఎఫ్ సి యూ కె లాంటి సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క కన్నడలో రాబర్ట్ అనే కన్నడ మూవీ, ఓ మలయాళ మూవీతో పాటు విజయ్ సేతుపతి ‘లాభం’ తమిళ సినిమాలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగపతి బాబు.. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా డబ్బింగ్ చెబుతోన్న ఒక వీడియో పోస్ట్ చేశారు. అది లాభం తమిళ సినిమాకు సంబంధించింది. అందులో ఆయన అలవోకగా తమిళంలో డైలాగ్స్ చెబుతుంటే… చూడముచ్చటగా అనిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఆయన తమిళంలో డబ్బింగ్ చెబుతుండడం విశేషంగా మారింది. మరి లాభం సినిమాలోని పాత్ర ఆయనకి కెరీర్ పరంగా ఎంతటి లాభాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ఏసుక్రీస్తుగా జగపతిబాబు – సోషల్ మీడియాలో వైరల్
I was pretty excited to dub in Tamil after so long. Here's behind the scenes from the dubbing studio for @VijaySethuOffl's #Labham. pic.twitter.com/UVJWtlcXWv
— Jaggu Bhai (@IamJagguBhai) January 30, 2021











