దస్తగిరి వాంగ్మూలం నమోదు..
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. మూడేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత పులివెందులలో సీబీఐ విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో వివేకా కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. గత ఏడాది ఆగస్ట్ 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలంను జడ్జి ముందు సీబీఐ అధికారులు నమోదు చేశారు. 2019 మార్చి 15 న వివేకా హత్యకేసులో నిందుతులుగా తేల్చి.. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి లను అరెస్ట్ చేసి, విచారించగా.. తాజా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని నిందుతుడిగా చేర్చింది. కాగా, కడప జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని మరోసారి సీబీఐ పులివెందుల కోర్టులో హాజరుపర్చింది. మరోసారి జడ్జి ముందు దస్తగిరి వాంగ్మూలం నమోదు చేసింది సీబీఐ. ఈ నేపథ్యంలో కీలక విషయాలను జడ్జి ముందు దస్తగిరి వెల్లడించినట్లు తెలుస్తోంది! అయితే దస్తగిరి అప్రూవర్ గా పరిగణిండాన్ని హైకోర్టు ఆమోదించింది. దీనిపై గతంలో కడప చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. అయితే కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందుతులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వేర్వేరుగా దాఖాలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే! మరోసారి దస్తగిరి వాంగ్మూలంతో వివేకా హత్యకేసులో కీలక సూత్రదారుల అరెస్ట్ లే తరువాయి అన్నట్లుగా ఉందని అందుతున్న సమచారం. అలానే గడిచిన రెండు వారాలుగా దర్యాప్తు విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది.
సూత్రదారుల అరెస్ట్‌లు జరిగేనా?
ఏపీ సీఎం జగన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్నది అందరికీ తెలుసునని విపక్షాలు కొడై కూస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు అధికారపార్టీ పెద్దలు వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వంటి వారు ఉన్నారని హత్య కేసులులో నిందుతుల్లో ఒకరైన ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు సీబీఐ ఎదుట దస్తగిరి అప్రూవర్ గా మారి ఒప్పుకున్న విషయం విదితమే! వివేక హత్య జరిగిన తరువాత ముందుగా డెడ్ బాడీ వద్దకు ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఇతర సన్నితులు వెళ్లారు.వీరితోపాటు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో ఉన్న వివేకా మృత దేహాన్ని పక్కకు జరిపి.. శివశంకర్ రెడ్డి ఆదేశాలతో పనిమనిషి లక్ష్మి రక్తపు మరకల్ని శుభ్రం చేసింది. వివేక తలకు గాయాలైన చోట్ల బ్యాండేజీ చుట్టించి కట్టు కట్టించారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా.. గుండెపోటుతో మరణించారని అవినాష్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే మాటను శివశంకర్ రెడ్డి సాక్షి టీవీకి తొలసారిగా చెప్పారు. వివేకా కుమార్తె, అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఇలా సీబీఐ విచారణలో వివేకా హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సోమవారం మరోసారి వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. ఈ వాగ్మూంలంతో ఈ కేసు విచారణ తుది దశకు చేరినట్లు తెలుస్తోంది! ఇక చివరిగా సూత్రదారుల అరెస్ట్ తో వివేక హత్య కేసు సుఖాంతం అయ్యేలా కనిపిస్తోంది!
Must Read:-వివేక హత్యకేసులో సూత్రదారి అరెస్ట్‌కు అడుగుదూరం! సీబీఐ ఛార్జ్‌షీట్ చెబుతున్న వాస్తవాలు!