హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్మాల్య బాగ్చి చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చి ఇంతకు ముందు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. కాగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు సీజేగా బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఈనెల 6న ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ రోజు జస్టీస్ మహేశ్వరికి హైకోర్టు న్యాయమూర్తులు వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు చేశారు. జస్టీస్ జెకె మహేశ్వరి, అక్టోబర్ 7న ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకమునుపు, మహేశ్వరి మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
Also Read: సూరిబాబు.. రాములోరికి బలిపశువు ఎలా అయ్యాడంటే..











