ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీ కాలం ఈరోజు ముగియనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్.వి.రమణ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణతో, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలోనే ప్రమాణ స్వీకారం జరగనుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులతో పాటు ఎన్.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశముంది.
జస్టీస్ రమణ నేపథ్యం
1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.
Must Read ;- ఎన్వీ రమణ@ సోషల్ జస్టిస్