తమిళ సినీ అభిమానులు ముఖ్యం గా సోషల్ మీడియా లో ఈ వారం చాలా హడావుడి గా ఉన్నారు. ఒకటి కమల్ హాసన్@60 అని – మరొకటి రజని కాంత్@45 అని . పోటాపోటీ గా ఎదిగిన ఈ సూపర్ స్టార్ ఇప్పుడు ఈ విషయం లో మరొక సారి పోటీ పడుతున్నారు . కమల్ హాసన్ సినీ రంగానికి బాల నటుడుగా ‘ కళత్తూర్ కన్నమ్మ ” సినిమా తో పరిచయం అయ్యారు. ఆ సినిమా1960 ఆగష్టు12 న విడుదల అయింది . ఇక రజనీ కాంత్ మొదటి సినిమా ” అపూర్వ రాగంగళ్ ” ఆగస్ట్15 న1975 లో విడుదలైంది . ఆ రకం గా ఈ ఇద్దరు మహా నటులకు ఈ ఏడాది .. ఆగస్ట్ నెల చాలా ప్రత్యేకం .
ఇద్దరి గురువూ ఒక్కరే
ఈ ఇద్దరు జీవితాలకు – ముఖ్యం గా సినీ రంగానికి సంబంధించి ఒకే గురువు కే. బాల చందర్ . ఈ ఇద్దరు నటుల అసలు పేర్లు వేరు – కమల్ హాసన్ అసలు పేరు – పార్థ సారధి . కమల్ హాసన్ అని ఆయన నాన్న గారే మార్చారు . ఇక రజనీ కాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. కమల్ హాసన్ అసలు పేరు పార్థ సారధి కాగా – చిన్నప్పుడే ఆయన తండ్రి కమల్ హాసన్ గా మార్చారు . షూటింగ్ మొదటి రోజు కే . బాల చందర్ శివాజీ రావుకి మూడు పేర్లు సూచించారు .చంద్ర కాంత్ – రజని కాంత్ – శ్రీ కాంత్ . వాటి లో రజనీ కాంత్ పేరు ఎన్నుకున్నారు శివాజీ రావు. కమల్ హాసన్ – రజనీ కాంత్ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి గొడవ పడుతున్నారు . అఫ్ కోర్స్ – సినిమా లో పాత్రల పరంగానే కావచ్చు . కానీ వారిద్దరి అభిమానులు మాత్రం పోటీ గానే చూస్తుంటారు .
వారి మొద టి సినిమా ” అపూర్వ రాగంగళ్ ” . కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో రజనీ కాంత్ ఫస్ట్ షాట్ కూడా కమల్ తో గొడవ పడటం . ఆ సినిమా లో హీరోయిన్ శ్రీ విద్య భర్త రజనీ కాంత్ కాగా – లవర్ పాత్ర కమల్ హాసన్ చేశారు .
16 సినిమాల ప్రయాణం
కమల్, రజనీ ఇద్దరూ కలిసి 16 సినిమాల్లో నటించారు. అపూర్వ రాగంగళ్ సినిమాని తెలుగులో దాసరి నారాయణ రావు ‘ తూర్పు పడమర ” పేరు తో రీమేక్ చేశారు . రజనీ కాంత్ పాత్రను తెలుగులో మోహన్ బాబు చేశారు . ఆ తర్వాత తెలుగులో కే . విశ్వనాధ్ తీసిన ” ఓ సీత కథ ” తమిళం లో బాలచందర్ రీమేక్ చేశారు . దేవదాస్ కనకాల పాత్రని రజనీ కాంత్ , చంద్ర మోహన్ క్యారెక్టర్ ను కమల్ హాసన్ చేశారు . ” మూండ్రు మోడిచ్చు ” పేరు తో వచ్చిన ఆ సినిమా లో – శ్రీదేవి హీరోయిన్ ” అవర్ గల్ ” అనే సినిమా1977 లో వీరి కాంబినేషన్ లో వచ్చింది . రజనీకాంత్ – కమల్ హాసన్ తో పాటు సుజాత హీరోయిన్ గా నటించారు . ఈ సినిమా తెలుగు లో ” ఇది కథ కాదు ” అని తీశారు . ఆ తర్వాత16 పయదినా లే ” ( తెలుగు లో పదహారేళ్ళ వయసు ) , ” తప్పు తాలంగళ్ ” ( ఇదో చరిత్ర ) , వయసు పిలించింది ” , ” అందమైన అనుభవం ” , ” తాయిళ్ళమే నాన్ ఇల్లే” , ” అల్లాఉద్దీన్ – అద్భుత దీపం ” మొదలైన సినిమాల్లో కలిసి నటించారు ఇద్దరూ కలిసి నటించిన చిట్ట చివరి తమిళ చిత్రం – ” తుళ్లు- ముళ్ళు” . కే . బాలచందర్ డైరెక్ట చేసిన ఈ సినిమా ” గోల్ మాల్ ” అనే హిందీ సినిమా ఆధారం గా తీశారు . ఆ తర్వాత ఇద్దరూ కలిసి నటించడానికి ఇష్టపడ లేదు.
మళ్లీ కలవక పోవడానికి కారణాలేమిటి?
వీరిద్దరి ఇమేజే దీనికి కారణం. మార్కెట్లు భారీ గా పెరిగి పోవడంతో కలిసి నటించలేదు . పైగా నటనలో ఒకరినొకరు పోల్చడం – అభిమానుల్లో మితి మీరిన ఆవేశ కావేశాలుతో నటించడానికి ఇష్ట పడ లేదు . ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతుండేవాళ్లని అప్పట్లో తమిళ మీడియా వార్తా కథనాలు రాసింది . ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ రజనీ కాంత్ తో సొంతం గా సినిమా తీయడాని కి ప్లాన్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి ? రజనీతో సినిమా తీసి , ఆర్ధికంగా బాగుపడాలనుకుంటున్నారా ? లేక వచ్చే ఎన్నికల్లో రజనీ కాంత్, తాను ఒక్కటే అని కమల్ ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నారా ?! రజనీ ఈ సినిమా గురించి పెదవి విప్పలేదు . కమల్ మాత్రం అనౌన్స్ చేశారు. ఈ చిత్రం లో కమల్ హాసన్ నటిస్తాడా లేదా అనేది ఏమీ తెలియదు . అసలు ఈ కాంబినేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇంకా బయటికి రాలేదు . ..
రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??
మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...











