తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మనోవేదన కలిగిస్తోంది. డీటీసీపీ,హెచ్ఎండీఏ అనుమతి లేని అక్రమ కట్టడాలకు రిజిస్ట్రేషనలను నిరాకరిస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఇదే సమయంలో అనుమతులు లేని నిర్మాణాలను మున్సిపాలిటీ, పంచాయితీ అధికారులు నిలిపివేసారు. దీంతో ప్రతి రోజు 40 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. గురువారం, శుక్రవారం కలిపి కూడా 20 కోట్ల ఆదాయం కూడా రాకపోవడంతోనే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది.
అన్నీ అనుమతులతో లేఔట్ లో ప్లాట్ కొనుగోలు చేయాలంటే మధ్యతరగతి వారికి భారం. అందుకే నాన్ లేఔట్ లో ప్లాట్ ను ఎక్కువ మంది కొనుగోలు చేసేవారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నాన్ లేఔట్ లో ప్లాట్ ను కొనుగోలు చేసేవారు ఉండరు. ఇదే సమయంలో ఇప్పటికే ఈ ప్లాట్లను కొనుగోలు చేసిన వారు రీసేల్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి నుంచి ప్రజలు ఈ విధానానికి అలవాటు పడతారని అధికారులు చెబుతుండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తమ బిజినెస్ దారుణంగా దెబ్బతింటోదని వాపోతున్నారు.
ఇన్ని రోజులు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అనుమతులు లేకపోయినా రిజిస్ట్రేషన్ల జరిగేవి. దీంతో చాలా మంది అనుమతులు లేకుండానే ఇళ్లను కొనుగోలు చేశారు. కానీ తాజాగా ప్రభుత్వం రెగ్యురైజేషన్ తప్పని సరి చేయడం వారికి షాక్ ఇచ్చింది. ఒకవేళ ప్రజల నుంచి వ్యాపారుల నుంచి డిమాండ్ వస్తే ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. భారీగా అప్లికేషన్ ఫీజులతో బాటు అధిక మొత్తంలో ఫైన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయంగా ఉండనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.











