ఈ నెల 19 తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తానని ఆయన తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి పనులను ఆయన తనిఖీ చేయనున్నారు. పనుల్లో అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రెండేళ్లు టైము ఇచ్చానని, ఇక రంగంలోకి దిగుతానన్నారు. పట్టణ ప్రగతి అమలుపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 13న ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రతి నెల గ్రామాల అభివృద్ధికి రూ.339 కోట్లు, ప్రతి మున్సిపాటిటీ అభివృద్ధికి రూ.149 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
Must Read ;- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పీఆర్సీ పెంపు ఉత్తర్వులు జారీ