వేతన సవరణ అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,21,037 ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పింఛన్ దారులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్ అమలు కానుంది. మొత్తం 30 శాతం ఫిట్మెంట్‌తో వేతన సవరణ అమలు చేయనుండగా, అందుకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను ప్రభుత్వం సవరించింది. ఈ జూన్ నెల నుంచే ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి. పీఆర్సీ ఉత్తర్వుల జారీ పట్ల పీఆర్టీయూ–టీఎస్, యూటీఎఫ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. మార్చి 22నే పీఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా కేసులు, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
Must Read ;- తరలిన తెలంగాణ కేబినెట్.. CJI జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం