ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన రూ. కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్నారు. గత నెల రోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
అసలేం జరిగింది..?
నకిలీ పాసు పుస్తకాల జారీ విషయయంలో కీసర మాజీ తహశీల్దార్ నాగరాజుపై ఏసీబీ అధికారులు మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు ?దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని ఏసీబీ వారు నాగరాజును ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అంతే కాకుండా ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని కూడా ఏసీబీ అధికారులు అతనిని అడిగినట్లు సమాచారం.
ముందు నుంచే ఉన్న చేతివాటం
కాగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. ఇక అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం
డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా డ్ర*గ్స్ అక్రమ...











