ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్ది రోజులుగా కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా ఆయన మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
జగన్ సీఎంగా ఉన్న సమయంలో టాలీవుడ్ తరపున చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఆయన దగ్గరకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు కేతిరెడ్డి. ఆ సమావేశంలో చిరంజీవి చాలా స్మార్ట్‌గా వ్యవహరించారని, జగన్‌కు ఆయన దండం పెట్టిన వీడియోక్లిప్ తర్వాత వైరల్‌గా మారిందని, ఆ వీడియోను చూసి పవన్‌కల్యాణ్ రెచ్చిపోయారన్నారు కేతిరెడ్డి. మరీ ఈ రోజు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. రేవంత్ దగ్గర చిరంజీవి ఏం చేశారన్నారు కేతిరెడ్డి. ఆ రోజు చిరంజీవి కుటుంబానికి జగన్ సన్మానం చేసి, రాగిముద్ద, నాటు కోడి పెట్టి పంపించారన్నారు కేతిరెడ్డి. కానీ మెగా బ్రదర్స్ లోలోపల మాట్లాడుకుని బయట వైసీపీని బద్నాం చేశారన్నారు కేతిరెడ్డి. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన అంశం గురించి పవన్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు కేతిరెడ్డి. ఇది కూడా సినిమా ఇండస్ట్రీ సమస్యే కదా అన్నారు. చిరంజీవి చాలా ముదురు అంటూ కామెంట్స్ చేశారు కేతిరెడ్డి.
ఐతే కేతిరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి జగన్‌కు చిరంజీవి దండం పెట్టిన వీడియో అప్పుడు బాగా వైరల్ అయింది. చిరంజీవికి కనీసం జగన్ తిరిగి నమస్కారం పెట్టలేదన్న విమర్శలు వచ్చాయి. ఐతే అన్ని విమర్శలు వచ్చినప్పటికీ..ఆ టైంలో వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశంపై స్పందించలేదు. ఐతే అప్పుడు ఈ అంశంపై క్లారిటీ ఇవ్వకుండా ఇప్పుడు చెప్పడం ఏంటని కేతిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మెగా ఫ్యామిలీపై విమర్శలు చేయడం సరికాదంటున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ధర్మం తప్పి మాట్లాడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.