అందరూ స్పీడుగా ఉంటే నేనెందుకు తగ్గాలి అనుకున్నారేమో నాగార్జున కూడా మరో కొత్త సినిమాని ప్రారంభించేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’, పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలను నాగ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగులు దాదాపు పూర్తయ్యాయి కూడా. దాంతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాకి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
చిత్ర యూనిట్‌తో పాటు నాగార్జున కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టాయి.
ఈ సినిమాలో నాగార్జున కొత్తగా కనిపిస్తారు అంటున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. స్పీడు తగ్గిందనుకున్న నాగార్జున ఈ సినిమా ప్రారంభంతో దూకుడు మీద ఉన్నట్టు అర్థమవుతోంది.
Must Read ;- నాగ్ మూవీలో అజిత్ డాటర్