ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత కూటమి నేతగా, టాప్ పొలిటికల్ లీడర్‌గా ఎవరికి అత్యధిక మెజారిటీ దక్కనుంది..?? టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్?? జనసేన అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..?? లేక మరో నేత ఎవరయినా ఉన్నారా.??? ఈ అంశాలపై ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల వ్యూహకర్త కిరణ్ కొండేటి సంచలన సర్వే చేశారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది.. ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తేదీ జూన్ 12. ఈ ఏడాది పాలనతోపాటు ఈ తరం యువనేతలలో ఎవరికి ఎంత పాపులారిటీ ఉంది అనే అంశంపైనా కేకే సర్వే చేశారు.. దీనిలో ఊహించని ప్రజాభిప్రాయం వెలుగులోకి వచ్చింది…
చంద్రబాబు నాయుడు తర్వాత కూటమిలో ఏ నేతకి ఎంత ప్రజాదరణ ఉంది.? ఎవరయితే ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపించగలరనే అంశాలపై కేకే సర్వే చేశారు.. ఈ సర్వేలో యువనేత లోకేష్‌కి అనూహ్య ప్రజాదరణ దక్కింది.. ప్రతి 100 మందిలో సుమారు 47.5 శాతం నారా లోకేష్‌కి ఓటేశారు… లోకేష్ ప్రభుత్వ పాలనపై పూర్తి పట్టు దక్కించుకున్నారని, ఆయన సమర్ధవంతంగా గవర్నమెంట్‌ని నడపగలరని అభిప్రాయ పడ్డారు. 47.5 శాతం అంటే, సుమారు 50 శాతం మంది లోకేష్‌కి జై కొట్టారు..
ఆ తర్వాతి స్థానంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు.. ఆయనకి సుమారు 35 శాతం మంది ఓటు వేశారు.. చంద్రబాబు తర్వాత ప్రభుత్వాన్ని నడప సామర్ధ్యం ఉన్న నేతగా జనసేనానికి ఈ 35 శాతం మంది మద్దతు ఇచ్చారు.. ఈ ఇద్దరి తర్వాత మూడవ స్థానంలో ఉన్న వ్యక్తి యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆయనకు 7శాతం ఓటు వేశారు.. ఎన్టీఆర్‌కి కూటమితో సంబంధం లేకపోయినా, ఆయన టీడీపీ, జనసేన, బీజేపీకి దూరంగా ఉన్నా… ఆయనకు 7 శాతం మంది మద్దతు ఇవ్వడం విశేషం..
నారా లోకేష్ .. మంత్రిగా, పార్టీ నేతగా ప్రజలకు చేరువ అవుతున్నారని కేకే సర్వే ఘంటాపథంగా తేల్చి చెబుతోంది.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళంతో యువత, మహిళలకు లోకేష్ చేరువ అయ్యారు.. ఇటు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్‌తో ప్రజలకు మరింత దగ్గరయ్యారు లోకేష్. ఇటు విద్యా శాఖ, ఐటీ శాఖ మంత్రిగా తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు లోకేష్.. తన పేషీలలో లోకేష్ ఫైల్స్ క్లియర్ చేయడంలోనూ ముందున్నాడు.. మంత్రిగా ఆయనకి మంచి మార్కులు పడుతున్నాయి.. ఇవే నారా లోకేష్‌కి ప్లస్ అయ్యాయి.. ఆయనని కేకే సర్వేలో టాపర్‌గా నిలిపాయి.. ఈ సర్వేతో లోకేష్ రేంజ్ మరింత పెరిగిందని టీడీపీ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి..











