మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం `’క్రాక్”. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. మొత్తం పాటలతో సహా చిత్రీకరణ పూర్తయింది. ఎస్. తమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా…మూడో పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. “కోరమీసం పోలీసోడా..” అంటూ సాగే ఈ రొమాంటిక్ పాటను సినిమాలో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న రవితేజను టీజ్ చేస్తూ శ్రుతి హాసన్ పాడే పాటగా చిత్రీకరించారు.
ఇదివరకు విడుదల చేసిన మ్యూజిక్ చార్టుల్లో టాప్‌లో ఉండగా, తాజాగా విడుదల చేసిన “కోరమీసం పోలీసోడా..” వాటికి మించిన స్పందన లభిస్తుందని చిత్రబృందం భావిస్తోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చిన ఈ పాటను రమ్యా బెహరా ఆలపించారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు..
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు, సంగీతం: ఎస్. తమన్.
Also Read: tollywood top directors