దివి నుంచి భువికి దిగి వచ్చిందా.? అనేట్టే ఉంది దివి. బిగ్ బాస్ 4 లో కంటెస్టంట్ లో హాట్ గా కనిపించి ఇట్టే ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు కానీ.. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తక్కువ టైమ్ లోనే బాగా పాపులర్ అయ్యింది. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. ఆమెకు సరైన గుర్తింపు తీసుకురాలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది అంతే.. ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడుకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
బిగ్ బాస్ 4 ఫైనల్ లో స్వయంగా మెగాస్టార్ చిరంజీవే దివి గురించి మాట్లాడడం.. ఆమెకు వేదాళం రీమేక్ లో అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించడం విశేషం. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దివి పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తుందని చెప్పారు. అయితే.. దివిని ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా చూపిస్తున్నాం కానీ.. ఆమెలో మరో యాంగిల్ కూడా ఉంది. గ్లామర్ అంటూ.. దివి అందం గురించి చిరు కాంప్లిమెంట్ ఇవ్వడం విశేషం. దివి యాక్టర్ గా మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటుంది.
Also Read: నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా?: ;బిగ్ బాస్ ; రన్నర్ అఖిల్
ఎవరైనా సినిమాల్లో అవకాశాలు రావాలని కోరుకుంటారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించే అవకాశం రావడం అంటే..మామూలు విషయం కాదు. ఈ సినిమాతో దివి దశ తిరగడం ఖాయం. అలాగే వచ్చిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే.. భవిష్యత్ లో దివి స్టార్ కావడం ఖాయం అంటున్నారు. మరి.. దివి అవకాశాలను ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.