చంద్రబాబుపై దాడి జరిగితే తమ బాధ్యత కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం.. ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. చంద్రబాబును టచ్ చేసేంత దమ్ము, ధైర్యం ఉన్నాయా అంటూ వైసీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. జగన్ పాదయాత్ర చేసింది.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అని మరచిపోవద్దన్నారు. ఆ సమయంలో పాదయాత్ర అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నించి ఉంటే.. జగన్ ఒక్క అడుగు కూడా వేసే వాడు కాదని చెప్పారు. చంద్రబాబు కుప్పం యాత్రలో ఆందోళనలను సృష్టించమని.. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు.
సజ్జల వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని.. డీజీపీ వెంటనే ప్రభుత్వ సలహాదారుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కోటం రెడ్డి. వైసీపీకి అంత దమ్ముంటే.. ఆదేదో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో చూపిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని.. ఇలా ప్రతిపక్షాలను.. ప్రజలను బెదిరించడం వల్ల ఉపయోగం ఉండదని కోటం రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా గురించి కనీసం నోరెత్తలేని వాళ్లు.. ప్రతి పక్షంపై దాడులకు మాత్రం ముందుంటారని ఎద్దెవా చేశారు.
Must Read ;- కుప్పంలో వైసీపీ అరాచకాలు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..