వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ సింహా రెడ్డి ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు.. అర్ధరాత్రి ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.. ముద్రగడ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులతోపాటు, అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.. తన తండ్రి కేన్సర్ బారిన పడ్డారని.. చికిత్స చేయించాల్సిన సోదరుడు పట్టించుకోవడం లేదని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు..
తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారని, సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా అతనికి అత్యవసరంగా అవసరమైన సరైన చికిత్సను నిరాకరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు కూతురు క్రాంతి…
మాజీ YSRCP MLA ఒకరు తనను, తండ్రి ముద్రగడని చూడటానికి మంచి ఉద్దేశంతో తీసుకెళ్లడానికి ప్రయత్నించారని, . కానీ గిరి, అతని మామగారు తన తండ్రిని కలవడానికి అనుమతించలేదని వాపోయారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం తనకు లేదని, దగ్గరి బంధువులకు, అతని అనుచరులు, సన్నిహితులకు కూడా అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు..
సోదరుడు గిరి, అత్తమామల సన్నిహితుల చేత అతను నిర్బంధించబడ్డాడని, ముద్రగడ ఒంటరిగా ఉన్నాడని, అతనిని సంప్రదించడానికి లేదా మాట్లాడటానికి ఎవరికీ అనుమతి లేదని కూతురు క్రాంతి ఆరోపించారు.. ఇది అమానుషమే కాదు, ఆమోదయోగ్యం కూడా కాదు. రాజకీయ కారణాల వలనే ఇదంతా చేస్తుంటే, వారిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు క్రాంతి.. తన తండ్రి గౌరవం తనకు ముఖ్యమని, ఆయన ఆరోగ్యంపై ఏం జరుగుతుందో వివరణ ఇవ్వాలని ఆమె వేడుకున్నారు..
గత ఎన్నికలకు కొద్దిగా ముందు తండ్రి ముద్రగడ రాజకీయాలతో విబేధించారు.. ఆయన వైసీపీకి జై కొడితే, కూతురు క్రాంతి జనసేనలో చేరడానికి సమాయత్తం అయ్యారు.. ఆమె రాకను జనసేనాని పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు.. ముద్రగడ కుటుంబ రాజకీయాలలో తాను ఎంటర్ కానని, ఎన్నికల తర్వాత జనసేనలో చేరాలని ఆయన సూచించారు.. అప్పటినుండి కూతురు క్రాంతితో ముద్రగడకి గ్యాప్ వచ్చింది.. తాజాగా, ముద్రగడ కేన్సర్ బారిన పడ్డారని తెలిసి కూతురి మనసు తల్లడిల్లుతోంది.. తండ్రి ఆరోగ్యం అంశంలో రాజకీయం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది.. దీంతో, అన్నకు ఘాటుకి మెస్సేజ్ చేసింది. మరి, సొంత ఫ్యామిలీ మెంబర్స్‌తోనే రాజకీయాలు చేసే వైసీపీ నేతలు… ముద్రగడ ఆరోగ్యం అంశంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..