ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం.. దేశం కోసం పనిచేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బుల్లెట్ రైలు గుజరాత్ కేనా? ..హైదరాబాద్‌కు అర్హత లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రం అధిక ఆదాయం పొందుతోందని కేటీఆర్ అన్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలు అమలు చేయడంలేదని ఆరోపించారు. కేంద్ర హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎవర్ని అడగాలన్నారు. దిగుమతి సుంకాలు పెంచి… మేకిన్ ఇండియా అంటే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
అడుగడుగునా అన్యాయమే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తోందని కేటీఆర్ అన్నారు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, అయినా కోచ్ ఫ్యాక్టరీ రాలేదన్నారు. మేకిన్ ఇండియా అంటున్న కేంద్రం.. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రియల్ జోన్ కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఐటీఐఆర్ కారిడార్‌ను రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు.
Must Read ;- కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. రైల్వే కోచ్‌ల కర్మాగారంపై నజర్!











