యంగ్ హీరో శర్వానంద్, గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తోన్న లవ్ అండ్ ఫ్యామిలీ మూవీ శ్రీకారం. వ్యవసాయ రంగం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా లో శర్వానంద్ యువ రైతుగా నటిస్తూండడం ఆసక్తి రేపుతోంది. కొత్త దర్శకుడు బి. కిశోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా.. ఈ నెల 11న విడుదల కాబోతున్న ‘శ్రీకారం’ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు మేకర్స్. అందులో భాగంగా శ్రీకారం ‘ట్రైలర్’ ను విడుదల చేశారు. యంగ్ హీరోలు నితిన్, నాని, వరుణ్ తేజ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది.
ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ , ఒక ఇంజినీర్ కొడుకు ఇంజినీర్ అవుతున్నాడు. మరి ఒక రైతు కొడుకు ఎందుకు రైతు అవలేకపోతున్నాడు? అని ఆవేదన చెందే పాత్రలో శర్వానంద్ మెప్పించబోతున్నాడని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. అలాగే.. వ్యవసాయ రంగం గొప్పతనాన్ని, రైతుల ఆవేదనను, ఆందోళనని కూడా ఈ సినిమాతో టచ్ చేయబోతున్నాడు. వాస్తవ సంఘటనలతో వ్యవసాయ రంగ ప్రధాన్యాన్ని ఈ సినిమాతో ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు. మరి ‘శ్రీకారం’ సినిమా శర్వానంద్ ను మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
Must Read ;- బెస్ట్ యాక్టర్స్ తో వర్క్ చేయడం ఆనందాన్నిస్తోంది











