తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనవడు హిమాన్షు రావు నిజంగానే తాతను మించిన మనవడు అనిపించుకున్నాడు. ఓ వైపు తాత, తండ్రి రాజకీయాల్లో తమదైన సత్తా చాటుతుంటే… బాలుడిగా ఉంటూనే వారిని మించిపోయేలా దూసుకెళుతున్నాడు. అతడిలోని ప్రతిభకు గుర్తింపుగా అతడికి దక్కిన అంతర్జాతీయ స్థాయి అవార్డే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు. కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కు డయానా అవార్డు లభించింది. గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాల్సిన పలు అంశాలను పరిగణలోకి తీసుకుని, ‘షోమా’ పేరుతో హిమాన్షు ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాడు. తన తాత ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాల్లో పలు కార్యక్రమాలను నిర్వహించాడు. గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు చేపట్టాల్సిన పలు అంశాలను.. ఆ ప్రాజెక్టులో కళ్లకు కట్టాడు. కల్తీ ఆహారం పట్ల గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. కల్తీ లేని ఆహారంపై వారిని చైతన్యవంతుల్ని చేశాడు. వీటిపై వీడియోలు తీసి గ్రామస్తుల్లో అవగాహన కల్పించాడు. ఫలితంగా హిమాన్షుకు డయానా అవార్డు దక్కింది.
అవార్డు ఎందుకు ఇస్తారు?
9 నుంచి 25 సంవత్సరాల వయసు వాళ్లకు ఈ అవార్డు ఇస్తుంటారు. చిన్న వయసులో సమాజం మార్పు కోసం పనిచేసేవాళ్లకు ఈ అవార్డును ప్రకటిస్తారు. బ్రిటన్ కేంద్రంగా ఈ అవార్డును అందించే సంస్థ, ప్రపంచవ్యాప్తంగా యువకులు చేసే సోషల్ వర్క్ ని పరిగణలోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో హిమాన్షు సేవలను గుర్తించిన ఆ సంస్థ…ప్రతిష్టాత్మకమైన డయానా అవార్డును హిమాన్షుకు ప్రకటించింది. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరు మీద ఈ అవార్డును అందిస్తున్నారు.
అభినందనల వెల్లువ
ఈ ప్రాజెక్టు కోసం సహాయం చేసిన తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ కు ఈ సందర్భంగా హిమాన్షు ధన్యవాదాలు తెలిపాడు. చిన్న వయసులోనే మానవతా దృక్పథంతో ఆలోచించి, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని పలువురు ప్రముఖులు సైతం హిమాన్షును అభినందిస్తున్నారు. తాతకు తగ్గ మనువడు అంటూ కొందరు, తాతను మించిన మనవడు అంటూ మరికొందరు హిమాన్షుపై అభినందనలు కురిపిస్తున్నారు. ఇక తండ్రి కేటీఆర్ తన కొడుకుపై అభినందనల వర్షం కురిపిస్తూ ఓ అదిరేటి ట్వీట్ చేశారు.
Must Read ;- లోకేశ్ అడుగు జాడల్లో దేవాన్ష్ : ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, నివాళి అర్పించి!
With great delight I announce that I have received my Diana Award for my tremendous Initiative SHOMA-Making Villages Self-Sustainable! More details will be announced soon! pic.twitter.com/l6FgUSKQfp
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) June 28, 2021