Latest Update Of Pawan Kalyan And Harish Shankar Movie :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. చక చకా సినిమాలు పూర్తి చేసేస్తున్నారు. కొత్త ప్రాజెక్టు పనుల్లో తలమునకలై ఉంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఇది పూర్తి కాగానే క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ పాల్గొంటారు. దాన్ని పూర్తి చేసిన వెంటనే హరీష్ శంకర్ సినిమా ప్రారంభమవుతుంది.
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ లు నిర్మించే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. దీని ప్రచార చిత్రాన్ని వపన్ పుట్టినరోజు సందర్భంగా విడుద చేశారు. పక్కా మాస్ మసాలాతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ లను ఎంపిక చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని అంటున్నారు.
బయటకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఓ జాతీయవాది తరహా పాత్ర అట. సమకాలీన రాజకీయాలతో ముడిపడిన కథాంశాన్ని పవన్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. భవదీయ భగత్ సింగ్ అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవలే విడులైన ప్రచార చిత్రంలో బైక్ పై పక్కా మాస్ లుక్ తో కనిపించే చిత్రాన్ని విడుదల చేశారు. పవన్ అభిమానుల నాడి ఎలా ఉంటుందో హరీష్ శంకర్ కు తెలుసు కాబట్టి వారికి కావలసిన అంశాలన్నీ ఇందులో ఉండే అవకాశం ఉంది. దర్శకనిర్మాతలు కూడా పవన్ తో తరచూ భేటీ అయి సినిమాపై అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.
Must Read ;- భీమ్లా నాయక్ పాట హిట్టే కాదు తిట్లు కూడా











