సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) అభివృద్ధి చేసిన డ్రైస్వాబ్ టెస్టు కిట్లతో కరోనా నిర్థారణకు ఖర్చు తక్కువతో పాటు ఫలితాలు కూడ త్వరగా రానున్నాయి.ఈ కరోనా టెస్టు కిట్ల తయారీకి భారత్‌కు చెందిన మొడికల్ డివైజెస్ కంపెనీ మెరిల్ సీసీఎంబీతో ఒప్పందం కుదుర్చుకుంది.ఇదే కాకుండా వాటి తయారీకి ఎక్కువ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంతో ధరలు తగ్గడంతో పాటు మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.తమకు నెలకు 2 కోట్ల కిట్లను తయారుచేసే సామర్థ్యం ఉందని మెరిల్ సంస్థ ఉపాధ్యక్షుడు సంజీవ్ భట్ తెలిపారు.తాము తయారు చేసే ఓక్కో కిట్‌తో 100 పరీక్షల వరకు చేయవచ్చని,ఖర్చు రూ.45 నుంచి 60 మధ్య ఉండవచ్చని మెరిల్ సంస్థ తెలిపింది.డ్రైస్వాబ్‌తో చౌకగా,వేగంగా కరోనా నిర్థారణ పరీక్షలు చేయవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు.త్వరలోనే ఈ కిట్లు విరివిగా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
Must Read ;- కరోనా వైరస్ చైనా సృష్టించిందే.. పరిశోధనాత్మక విశ్లేషణ











