బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఊర్వశి రౌతేలా చాలా ప్రత్యేకం. అందం, అభినయంతో పాటు పొడగరి అవడంతో .. మిగతా అందగత్తెలకన్నా విభిన్నంగా ఫోకస్ అవుతుంది. 2015 లో మిస్ దివా యూనివర్స్ గానూ, మిస్ యూనివర్స్ గానూ ఎంపికైన ఈ బ్యూటీ.. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ స్ర్కీన్ పైకి తేలిగ్గానే రంగ ప్రవేశం చేసింది. సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4.. ఇంకా పాగల్ పంటీలాంటి చిత్రాలతో హాట్ గా ఎలివేట్ అయింది.
ఎర్లియర్ గా బాలీవుడ్ లో ‘వర్జిన్ భానుప్రియ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి ప్రస్తుతం తెలుగులో ‘బ్లాక్ రోజ్’ అనే మూవీ తో ఎంట్రీ ఇస్తుండగా.. నటిస్తుండగా.. ఓ తమిళ సినిమాతో కోలీవుడ్ లోనూ ఎంటర్ అవుతోంది. కన్నడ, బెంగాలీ చిత్రాల్లో కూడా ఇంతకు ముందే ఎంట్రీస్ ఇచ్చిన ఊర్వశి ప్రస్తుతం ఈ లాక్ డౌన్ టైమ్ ను సోషల్ మీడియాలోని తన హాట్ పిక్స్ తో ఓ రేంజ్ లో టైమ్ పాస్ చేస్తోంది.
తాజాగా ఊర్వశి రౌతేలా .. తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ డ్యాన్సింగ్ వీడియో నెటిజెన్స్ ను భలేగా ఆకట్టుకుంటోంది. నీలి రంగు దుస్తుల్లో చెలాకీగా నర్తిస్తున్న ఆమెను చూస్తుంటే.. ఆ ఇంద్రసభలో మేనక, రంభలతో పాటు .. ఈ ఊర్వశి కూడా నర్తిస్తున్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అలాగే.. అత్యధికంగా ఉన్న ఆమె ఫాలోవర్స్ .. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు.
Must Read ;- నెత్తిన కొప్పెట్టుకొని ఇన్ స్టాను ఊపేస్తున్న రష్మీ