అకస్మాత్తుగా కన్నుమూసిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా జీవితం అంత సాఫీగా ఏమీ సాగలేదు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో బాధ్యతలు అతని భుజస్కంధాలపై పడ్డాయి. నిజానికి బిగ్ బాస్ సీజన్ 13 విజేత అయ్యాకే అతని జీవితం మలుపు తిరిగింది. ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3’ సూపర్ సక్సెస్ కావడం, విడుదలైన మ్యూజిక్ వీడియోలు అతడిని కెరీర్ ను ఉన్నత శిఖరాల దిశగా మళ్లించాయి. అతని జీవితంలో కీలక ఘట్టాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇదీ సిద్ధార్థ్ శుక్లా జీవితం
* ముంబయిలో అశోక్ శుక్లా, రీటా శుక్లాలకు 1980 డిసెంబరు 12న జన్మించాడు.
* ఇంటీరియర్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి వాటికి సంబంధించిన సంస్థలో ఉద్యోగం చేశాడు.
* చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో మోడల్ గా పనిచేయడం ప్రారంభించాడు.
* అథ్లెటిక్స్ అంటే ఎంతో ఇష్టం. ఇటాలియన్ ఫుట్ బాల్ క్లబ్ , ఏసీ మిలన్ అండర్ 19 జట్టు ఫెస్టా ఇటాలియానాలో భాగంగా ముంబై పర్యటనలో పాల్గొని ఆడాడు.
* 2004 లో గ్లాడ్రాగ్స్ మన్ హంట్, మెగామోడల్ పోటీలో రన్నరప్‌గా నిలిచాడు.
*. 2005లో ప్రపంచవ్యాప్తంగా 40 మంది పోటీదారులను ఓడించి టర్కీలో ప్రపంచ అత్యుత్తమ మోడల్ టైటిల్ గెలుచుకున్నాడు.
* 2008లో సోనీ టీవీ షో ‘బాబు కా ఆంగాన్ చూటే నా’ లో కీలక పాత్ర పోషించాడు, ‘బాలికా వధు’ సీరియల్‌తో దాన్ని ఇంటి పేరుగా పేరుగా మార్చుకున్నాడు. ఇది అనేక అవార్డుల్ని సంపాదించిపెట్టింది.
* ధర్మ ప్రొడక్షన్స్ ‘రోమ్-కామ్’ హంప్టీ శర్మకి దుల్హానియా’తో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అలియా భట్, వరుణ్ ధావన్‌లతో కలిసి ‘బ్రేక్‌త్రూ సపోర్టింగ్ పెర్ఫార్మెన్స్’ కి స్టార్‌డస్ట్ అవార్డు లభించింది.
* ‘బిగ్ బాస్ 13’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 7’ అనే రియాలిటీ షోలలో గెలుపొందాడు.
* ‘సవధాన్ ఇండియా’, ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ లకు హోస్ట్ చేశాడు.
* పెళ్లి చేసుకోలేదుగానీ నటి షెహ్నాజ్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ 13 నుంచి వీరిద్దరికీ స్నేహం కుదిరింది.
* అతని చేతిలో ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. డిస్నీప్లస్ హాట్ స్టార్ కోసం ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. టీవీ నటి జెన్నిఫర్ వింగెట్ తో మరో ఓటీటీ షో కూడా ఉంది. మరి కొన్ని షోలకు హోస్ట్ గానూ ఎంపికయ్యాడు.
* అతని మరణంలో ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3’ అర్ధాంతరంగా ముగిసిపోతుంది. దీనికి మంచి క్రేజ్ లభించిడంతో దీనికి సీక్వెల్ చేయటానికి రంగం సిధ్దమైంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవలసిందే.











