క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రంగమార్తాండ’. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’ కి రీమేక్. ‘నక్షత్రం’ సినిమా తర్వాత కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈసారి కృష్ణవంశీకి బాగా గ్యాప్ రావడం.. అంతే కాకుండా ఈసారి రీమేక్ ని తెరకెక్కిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. రంగమార్తండకు సంబంధించి ఇంకా ఇరవై రోజులు షూటింగ్ ఉందట. ఇప్పుడు ఈ సినిమా పై పైసా కూడా పెట్టలేను అని చెప్పి నిర్మాత చేతు లెత్తేశాడట. సినిమా చివరి దశలో ఉన్నఈ టైమ్ లో నిర్మాత చేతులెత్తేయడం అంటే ఎవరైనా షాకే. అయితే.. కృష్ణవంశీకి ఇలాంటి సినిమా కష్టాలు మామూలే. ఇలా కష్టాలు వచ్చిన ప్రతిసారీ.. ఎలాగోలా తట్టుకుని వాటి నుంచి బయటపడుతుంటారు. ఇప్పుడు అదే చేస్తున్నారట.
20 రోజులు షూటింగ్ ఖర్చు, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కోసం పెట్టుబడి పెట్టే వేరే నిర్మాతను వెతుకుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ అడ్డంకులను దాటుకుని సినిమాని పూర్తి చేసి.. రంగమార్తండ సినిమాతో సక్సెస్ సాధిస్తారని.. కృష్ణవంశీ మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఆశిద్దాం.
Must Read ;- తెలివిగా సమాధానం చెప్పిన మాస్ మహారాజా
https://www.youtube.com/watch?v=q7Wxqbs6MfM











