విశాఖ నగరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అరాచకాలకు అడ్డాగా మారిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విశాఖలో స్థలాలపై విజయసాయిరెడ్డి కన్నుపడితే కబ్జా చేస్తున్నాడని,ఎదురుతిరిగితే జేసీబీలతో కూల్చి వేయిస్తున్నాడని నారా లోకేష్ ధ్వజమెత్తారు.విశాఖ నగరం పెదవాల్తేరులోని హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్‌ను కబ్జా చేయాలని విజయసాయిరెడ్డి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.సాధ్యం కాకపోవడంతో ఎప్పటిలాగే శనివారం కూల్చివేతలకు దిగారని లోకేష్ విమర్శించారు.
పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది
వైసీపీ నేతల పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందని నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ జమానాలో విశాఖ పాలనా రాజధాని అవుతుందో లేదో తెలియదు కాని, పులివెందుల అరాచకాలకు అడ్డాగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ లక్ష్మీప్రసన్నపై దాడిని కూడా లోకేష్ ఖండించారు. లక్ష్మీప్రసన్నపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రంట్ లైన్ వారియర్స్‌పై దాడి ఇది మొదటిసారి కాదని, జగన్ రెడ్డి అరాచకాలకు ఇది నిదర్శనమని లోకేష్ అన్నారు.
Must Read ;- లక్ష్మీ ప్రసన్నపై దాడి చేయటం సిగ్గుచేటు : నారా లోకేశ్