తన అందం, అభినయంతో మెప్పించినప్పటికీ తాము నటించిన సినిమా సక్సెస్ కాకపోతే కూడా అవకాశాలు రాని నటీమణులు సైతం ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో మాళవిక శర్మ ఒకరని అంటారు. స్మార్ట్ లుక్ తో యువ హృదయాలను కొల్లగొట్టగల ఫిజిక్ ఆమె సొంతమైనప్పటికీ తొలి చిత్రం సక్సెస్ కాకపోవడం ఆమె కెరీర్ ను మలుపు తిప్పకపోవడం అటుంచి కనీసం కొన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టలేకపోయింది. ముంబైకి చెందిన ఈ భామ ఓ వైపు లా చదువుతూనే మోడల్ గా కొన్ని ప్రాజెక్టులు చేసి తెలుగు సినీరంగాన్నిఆకట్టుకుంది.
మొదటి అవకాశమే మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం లభించింది. అయితే ఈ చిత్రంపై పెట్టుకున్న అంచనాలు బాక్సాఫీస్ వద్ద తలకిందులయ్యాయి. అంతేకాదు ఆ సినిమాతో తన కెరీర్ ప్రకాశిస్తుందని భావించిన మాళవికకు నిరాశే ఎదురైంది. కొత్త సినిమాలు అంతగా తన దరి చేరకపోవడంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సినీరంగం దృష్టిలో పడాలని తపన చెందుతోంది. కాకపోతే చాలా గ్యాప్ తర్వాత ఆమెకు “రెడ్” చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది. రామ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి ఎంత మేరకు ఉంటుందో, కనీసం ఈ చిత్రం తర్వాత అయినా కెరీర్ మలుపు తిరుగుతుందేమో వేచిచూడాల్సిందే