ఓ వైపు షర్మిల పెట్టే పార్టీతో తమకెలాంటి సంబంధం లేదని, అభిప్రాయభేదాలే గాని విబేధాలు లేవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించగా జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నేడు హైదరాబాద్‌లో ఆమెతో భేటి కావడం ఆసక్తికరంగా మారింది. ఆళ్ల షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తోనూ ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి జగన్ అనుమతితోనే ఆమెతో భేటి అయినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన ఆళ్ల జగన్ దూతగానే ఆమెతో చర్చలు జరిపారన్న వాదనలూ ఉన్నాయి.
Must Read ;- ఏప్రిల్ 10న షర్మిల పార్టీ ప్రకటన!











