పై ఫొటో చూశారు కదా. నీట్‌గా టక్కు చేసుకుని వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసు కదా. బ్రదర్ అనిల్ కుమార్. క్రైస్తవ మత బోధకుడు. అంతేనా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వయానా బావ. అంటే జగన్ సోదరి వైఎస్ షర్మిళకు భర్త. ఇంకేమైనా పదవులు ఉన్నాయా?… అంటే లేవనే చెప్పాలి. మరి తిరుపతి సమీపంలోని రేణిగుంటకు ఆయన వస్తే… అధికారులు, సెక్యూరిటీ పర్సనెల్,. మరీ ముఖ్యంగా పోలీసు అధికారులు ఆయన ముందు ఎందుకంతగా సాగిలపడ్డారు? ఇది జగన్ జమానా. జగన్ అయినా… ఆయన బంధువులు ఎవరు వచ్చినా అధికార గణమంతా సాగిలపడాల్సిందే. ఈ ఫొటోలు చూస్తుంటే తెలిసిపోతుంది కదా.
గతంలోనూ..
అప్పుడెప్పుడో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా… ఏ పదవీ లేని జగన్ కూడా ఏకంగా జిల్లా సమీక్ష సందర్భంగా తండ్రి పక్కనే వేదికపైనే కూర్చుని తనదైన శైలి దర్పాన్ని ఒలకబోశారు. అదేమంటే… సీఎం కొడుకు అలా వేదిక మీద కూర్చుంటేనే తప్పవుతుందా? అని దీర్ఘాలు తీశారు. ఆ తర్వాత పిన తండ్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డిని ఎంపీగా దించేసి ఆ స్థానంలో తాను పోటీ చేసి ఎంపీగా మారిపోయారు. అయితే ఏ పదవీ లేనప్పుడు ఒలకబోసిన డాబూ, దర్పం… ఎంపీగా అయ్యాక సమీక్షలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణలు జగన్‌కు అసలే పట్టని వైనం కూడా మనకు తెలియనిదేమీ కాదు. మొత్తంగా జగన్ అండ్ ఫ్యామిలీ ఓ వింత కేరెక్టర్ల కిందే లెక్క.

ఎలాంటి అధికారిక హోదా లేకున్నా..
ఈ మాట నిజమేనన్నట్లుగా సోమవారం రేణిగుంట పరిధిలో ఓ చర్చి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి క్రైస్తవ మత బోధకుడి హోదాలో జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ విచ్చేశారు. సీఎం బావ గారు వస్తే.. అధికారులంతా ఆయన ముందు సాగిలపడాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే… ఆయన గారికి ఎలాంటి అధికారిక హోదా లేదు. ఇవేవీ పట్టని అధికారులు… సీఎం బావగారు ఎక్కడ మనసు నొచ్చుకుని తమపై సీఎంకు ఫిర్యాదు చేస్తారని భావించారో, ఏమో తెలియదు గానీ… రేణిగుంటకు బ్రదర్ అనిల్ కుమార్ రాగానే… ఆయన కారులో నుంచి కాలు కింద పెట్టారో లేదో… అధికారులు, పోలీసులు వంగి వంగి మరీ దండాలు పెట్టారు. ఆ తర్వాత ఓ సినిమాటిక్ హీరోలా బ్రదర్ అనిల్ ముందుకు సాగగా… అటూ ఇటూ అధికారులు ఓ రేంజిలో సెక్యూరిటీ కల్పిస్తూ సాగారు. నిజంగానే ఈ ఫొటోలు జనాన్ని అమితాశ్చర్యానికి గురి చేశాయి.
Must Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!











