కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సిద్ధమైంది. 8 నుంచి 10 లక్షల వరకు టీకా వేయాలనే లక్ష్యంతో మెగా డ్రైవ్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడినవాళ్లలకు, పిల్లల తల్లులకు, విదేశాలకు వెళ్లేవాళ్లకు టీకా పంపిణీ జరుగుతోంది. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.02 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో ఆక్సిజన్ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్ ఏర్పాటులో విఫలమైన ప్రభుత్వం.. మెగా వ్యాక్సినేషన్ కు భారీ ఏర్పాట్లు చేసింది. వ్యాక్సిన్ల లభ్యతను ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తోంది. ఇవాళ జరిగిన మెగా డ్రైవ్ లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1.12 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.
Must Read ;- 5జీ టవర్లతో రోగ నిరోధక శక్తి తగ్గుతుందా.. కొవిడ్ వ్యాక్సిన్‌తో శరీరం అయస్కాంతం అవుతుందా?