కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొంతమంది శరీరం అయస్కాంతంగా మారుతోందా అనే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి అమెరికాలోని ఒహియో హౌస్ హెల్త్ కమిటీలో జరిగిన చర్చ కూడా అంతర్జాతీయంగా వైరల్ అవుతోంది. 248 హౌస్ బిల్‌కు సంబంధించి జరిగి చర్చలో క్లీవ్ లాండ్ వైద్యురాలు మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకుంటే శరీరం అయస్కాంతంగా మారుతుందని, 5జీ టవర్ల ద్వారా రోగ నిరోధక శక్తి తగ్గుతుందనే అనుమానాలున్నాయన్నారు. అయితే ఇందుకు సమాధానంగా ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ షెర్రీ టెన్పెన్నీ మాట్లాడుతూ ఇంటర్నెట్‌లో కొన్ని అంశాలు ప్రచారంలో ఉన్నాయని, తాము కూడా ఆ ఫొటోలని చూశామని, నుదుటిపై, శరీరంపై స్పూన్లు, ఇనుప వస్తువులు అతుక్కోవడం గమనించామన్నారు. అయితే వ్యాక్సిన్లో ఎలాంటి మాగ్నటిక్ లేదా మైక్రోచిప్‌లు లేవని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్లలో ఎలాంటి లోహాలు కూడా లేవని వ్యాఖ్యానించారు. ఇక 5జి టవర్ల ఏర్పాటు వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందనే ప్రచారంపైనా ఈ కమిటీలో చర్చ జరిగింది. 5జి టవర్లతో రోగనిరోధక శక్తి తగ్గుతుందనేందుకు ఎలాంటి ఆధారాల్లేవని కమిటీలో చర్చ నడిచింది. ఈ అంశానికి సంబంధించి NBC4i.com (CNBC), fox8.com లతో పాటు రాయిటర్స్ పత్రిక కూడా పేర్కొంది.
మహారాష్ట్రలోని నాసిక్‌లో..
అయితే ఇలాంటే ఘటనే మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఓ వ్యక్తి శరీరం అయస్కాంతంలా మారిందని, శరీరానికి స్పూన్‌లు, ఫోర్క్‌లు అతుక్కుంటున్నాయనే వార్తలు వచ్చాయి. BBC.com ఈ వార్తను ప్రచురించడంతో అంతర్జాతీయంగా వైరల్ అయింది. మహారాష్ట్రలోని నాసిక్‌కి చెందిన అరివింద్ సోనార్ వ్యాక్సిన్ మొదటి డోసు మార్చి 9న, రెండో డోసు జూన్ 2న వేయించుకున్నారు. పదేళ్ల క్రితం అరవింద్‌కు బైపాస్ సర్జరీ జరిగింది. రెండేళ్ల నుంచీ డయాబెటిస్ చికిత్స తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న కొన్ని రోజుల తరవాత తన శరీరానికి ఇనుప వస్తువులు, నాణేలు అతుక్కుపోతున్నాయని చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అరవింద్ చెప్పిన ప్రకారం గతంలో మా అబ్బాయి ఇలాంటివి జరుగతాయని చెప్పాడు. అయితే నేను నమ్మలేదు. నేను వ్యాక్సిన్ వేయించుకున్నాక అసలు విషయం తెలుసుకుందామని ప్రయత్నించా. ఇనుప వస్తువులు నా శరీరానికీ అతుక్కుంటున్నాయని అని చెప్పాడు.
Must Read ;- వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనాతో ఎవరూ చనిపోలేదు : ఎయిమ్స్

శరీరంపై తేమ లేదా వ్యాక్యూమ్ కావిటీ ఉంటే..
ఈ అంశంపై ఆ ప్రాంతంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ హామిద్ ధబోల్కర్ మాట్లాడుతూ శరీరంపై తేమ లేదా వ్యాక్యూమ్ కావిటీ ఉన్నా అది జరుగుతుందని, వ్యాక్సిన్‌కు, శరీరం అయస్కాంతంగా మారడానికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, అశాస్త్రీయ ప్రచారాలు నమ్మవద్దని వ్యాఖ్యానించారు. జేజే మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ తాత్యారావే లహానే కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్టు బీబీసీ ఆ కథనంలో పేర్కొంది. కాగా ఈ అంశానికి సంబంధించి తమకు సమచారం వచ్చిందని, పూర్తి వివరాలు సేకరించి విచారణ జరుపుతామని నాసిక్ జిల్లా మెడికల్ ఆఫీసర్ అశోక్ తోరత్ వెల్లడించారు. ప్రత్యేక బృందాన్ని పంపి నమూనాలు సేకరించినట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ వలన ఇలాంటివి జరిగే ఆస్కారం లేదని వ్యాఖ్యానించారు. కాగా ఈ అంశంపై మెటలర్జిస్టులు అధ్యయనం చేయాల్సి ఉందని IMA సభ్యుడు సమీర్ వ్యాఖ్యానించారు. బీబీసీలో ఈ వార్త ప్రచురితం కావడం, అదే సమయంలో ఒహియో హెల్త్ కమిటీలో చర్చ జరగడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
Must Read ;- ఖ్యాతి కోసం పాకులాట.. వ్యాక్సిన్లపై అసలు విషయం వెల్లడించిన ‘నీతి’











