కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాకా.. సినీ సెలబ్రటీస్ కుటుంబాలు పెళ్ళిళ్ళతో కళకళలాడుతున్నాయి. లాక్ డౌన్ లో సైతం.. యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ పెళ్ళిళ్ళు జరుగగా.. మొన్నామధ్యనే రానా, మిహికల వివాహం జరిగింది. ఇక గత నెల 30న కాజల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూ చేత మూడుముళ్ళు వేయించుకుంది. త్వరలోనే నాగబాబు కుమార్తె నిహారిక కూడా పెళ్ళిచేసుకోనుంది. తాజా గా యువతరం సంగీత దర్శకుడు రఘు కుంచె కుమార్తె రాగ పుష్యమి వివాహం ఆశిష్ వర్మ తో కన్నుల పండుగగా జరిగింది.

ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంకా దర్శకుడు వి. వినాయక్, నిర్మాత అనిల్ సుంకర , ప్లే బ్యాక్ సింగర్ మనో, సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్, గీత రచయితలు చంద్రబోసు, భాస్కర భట్ల విచ్చేసి దంపతులకు శుభాశీస్సులందించారు. కాగా నాగపుష్యమి, ఆశీష్ వర్మ జంట చూడముచ్చటగా ఉంది. పెళ్ళి హైద్రాబాద్ లో అక్టోబర్ 29న జరిగినా ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఆలస్యంగా విడుదలయ్యాయి.











