మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి వేడుకలు ఉదయ్ ఫూర్ లో చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇరుకుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరుగుతున్న నిహారిక పెళ్లి ఈ రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. మెగా హీరోలందరూ ఈ పెళ్ళి వేడుక ద్వారా ఓకే ఫ్రేమ్ లోకి వచ్చారు. నిన్న సాయంత్రం నిహారిక చిన్నాన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొనడం ప్రత్యేకార్షణగా నిలిచింది. సోమవారం రాత్రి సంగీత వేడుకలు జరగగా.. మంగళవారం రాత్రి మెహందీ వేడుకల ఘనంగా జరిగాయి.

అయితే.. ఈ వేడుకలో చిరంజీవి, సురేఖ దంపతులు చేసిన డ్యాన్స్ ప్రత్యేకార్షణగా నిలిచింది. ఇంతకీ.. వీరిద్దరూ ఏ పాటకు డ్యాన్స్ చేసారంటే.. ‘ఘరానా మొగుడు’ సినిమాలోని బంగారు కోడిపెట్ట.. అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఇక అల్లు అరవింద్, నిర్మల దంపతులు చూడాలనివుంది సినిమాలోని రామ్మా చిలకమ్మా.. సాంగ్ కు డ్యాన్స్ చేయడం విశేషం. ఇక నాగబాబు, పెళ్లికొడుకు చైతన్య, పెళ్లి కూతురు నిహారిక గ్యాంగ్ లీడర్ సాంగ్ కు డ్యాన్స్ చేయడం మరో విశేషం. ఈ వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.
చిరు డ్యాన్స్ చేస్తూ.. పక్కనే ఉన్న అల్లు అర్జున్ కూడా డ్యాన్స్ వేయమనగా.. మీ డ్యాన్స్ చూస్తానే కానీ.. మీతో కలిసి డ్యాన్స్ చేయలేను అని సరదాగా అంటూ చిరు డ్యాన్స్ చేస్తూంటే చూసి ఎంతో సంతోషించాడు. ఈ వీడియోలు ఇలా బయటకు వచ్చాయో లేదో.. నెట్టింట్లో అలా వైరల్ అయ్యాయి. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోలను చూసి తెగ సంబరపడుతున్నారు.
Must Read ;- నిహారికకు 2కోట్లు ఖరీదు చేసే నగలను గిఫ్ట్ గా ఇచ్చిన పెదనాన్న
https://www.youtube.com/watch?v=nocaKEu5v-Y











