మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్ళికి ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీతో పాటుగా చైతన్య కుటుంబసబ్యులు కూడా వివాహ వేడుక జరిగే ఉదయపూర్ ప్యాలెస్ కు చేరుకొని సందడి చేస్తున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ వివాహానికి 120 మంది అతిధులను మాత్రమే పిలిచారట.
కరోనా నియమ నిబంధనల మేరకు కొద్ది మందికే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. పెళ్లి ఉదయపూర్ లో జరిగిన తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉండనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. నిహారికకు అత్యంత సన్నిహితంగా ఉండే హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ పెళ్లికి హాజరు కాబోతున్నారు. అలాగే నాగబాబు, రామ్ చరణ్ ప్రత్యేకంగా దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ ను ఆహ్వానించారని టాక్. ఇక పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి కాని ఉదయపూర్ చేరుకుంటారట.
మరోవైపు చిరు కూడా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కొరటాల శివ తదితరులను ఆహ్వానించారట. ఇక నాగబాబు తనయుడు వరుణ్ తేజ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఉదయపూర్ ప్యాలస్ లో పండుగ వాతావరణం నెలకొంది. రాత్రి జరిగిన సంగీత్ లో వధువరులు ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి పాటలకు అదిరిపోయే స్టెప్స్ వేశారు.
Must Read ;- ఆచార్య క్లైమాక్స్ ను భారీగా డిజైన్ చేసిన కొరటాల