టీఆర్ఎస్ కు చెందిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివారాల ప్రకారం, వెర్నాక్యులర్ ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ ని ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. సంగారెడ్డి ప్రాంతంలో అమీన్ పూర్ లోని ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే కి చెందిన కొందరు ఖబ్జా చేసిన విషయాన్ని రిపోర్టర్ వెలుగులోకి తేవడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఆ స్ధలం విషయాన్ని పట్టించుకోవద్దని రిపోర్టర్ కి ఎమ్మెల్యే నుండి బెదిరింపులు వచ్చినట్లు రిపోర్టర్ తన ఫిర్యాదు పేర్కోన్నారు.
ఎమ్మెల్యే, రిపోర్టర్ సంభాషణలు నెట్టింట్లో వైరల్ కావడంతో పోలీసులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తుంది. రిపోర్టర్ ఫిర్యాదు ఆదారంగా 109,448,504,506-IPC,3(2) (Va)- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 2015 కింద సంగారెడ్డి పరిధిలోని అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అధికార గర్వమేల?
అధికారం మాదే కదా ఏదైనా చేయచ్చులే అనుకుంటే ఇలాగే జరుగుతుంది. సమాజంలో జరుగుతున్ని అన్యాయాన్ని, అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత, అధికారం జర్నలిస్ట్ కు ఉంటుంది. వారి స్వేచ్ఛను హరించి, కులం పేరు దూషించడం చాలా దారుణం. అందునా, అధికార పార్లీలో ఉండి, బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పదవిని ప్రజల ఓట్లతో గెలిచి ఇలా మీడియా స్వేచ్ఛను హరించడానికి పాల్పడితే ఎలాంటి వారైనా చట్టానికి ఒకటే అనడానికి ఈ సంఘటన నిదర్శనం.
Must Read ;- జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని పరామర్శించిన మెగాస్టార్