మెగా డాటర్ నిహారిక, చైతన్యలకు మరి కొద్దీ గంటల్లో వివాహం జరగబోతోంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఉదయపూర్ ప్యాలస్ కు చేరుకున్నారు. వీరితో పాటు అల్లు ఫ్యామిలీ కూడా ఉదయపూర్ చేరుకుంది. వీరందరి రాకతో ప్యాలస్ మొత్తం సందడిగా మారిపోయింది. ఇప్పటికే నాగబాబు తన ముద్దుల కూతురికి కట్నం రూపంలో భారీగానే ముట్టచెప్పాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నిహారికకు కళ్ళు చెదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని సమాచారం. మొదటి నుండి నిహారిక కి నాగబాబు కన్నా చిరంజీవితోనే అఫెక్షన్ ఎక్కువ. ఆ విషయం చిరు చాలా సందర్భాల్లో చెప్పారు. నిహారిక కూడా చిరుని డాడీ అనే పిలుస్తుంది.
కుటుంబంలో అందరికన్నా చిన్నది అవ్వడంతో నిహారికపై చిరుకి ప్రత్యేకమైన ప్రేమ. ఆ ప్రేమతోనే నిహారికకు ఏకంగా రూ. 2కోట్లు విలువ చేసే నగలను గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. స్వయంగా చిరంజీవి దంపతులు కలిసి నిహారికకు నగలు ఇచ్చారని సమాచారం. చిరుకు తనపై ఉన్న ప్రేమకు నిహారిక ఎంతగానో ఆనందపడిందని మెగా ఫామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా హైదరాబాద్ లో ఒక ఖరీదైన స్థలాన్ని కూడా చిరు ఇచ్చారని టాక్ నడుస్తోంది.
ఇక వివాహానికి కొన్ని గంటలే ఉండడంతో పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జరిగిన సంగీత్ లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు ఇరగదీశారు. అతితక్కువ కుటుంబసభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ పెళ్ళికి ముఖ్య అతిధులుగా సినీ ప్రముఖులు హాజరవుతారు.
Must Read ;- నాడు అమ్మ కట్టిన చీరతో.. నేడు పెళ్లి కూతురైన నిహారిక