టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మెగా డాటర్ నిహారిక పెళ్లిసందడి ముగిసిన వెంటనే ‘ఆచార్య’ షూటింగ్ లో చిరు జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ ను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ.
అందుకు తగ్గట్లు హైదరాబాద్ లో అత్యంత ఖరీదుతో ఒక సెట్ ను నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సెట్ లోనే క్లైమాక్స్ ఫైట్స్ ను తెరకెక్కిస్తారట. అయితే ఫైట్ మాస్టర్స్ ఎవరనే విషయం బయటకు రాలేదు. వెంట్రుకలు నిక్కబొడుచుకునే విధంగా క్లైమాక్స్ సాలిడ్ గా ఉండబోతోందని టాలీవుడ్ టాక్ . దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ క్లైమాక్స్ ఫైట్స్ లో చిరంజీవి నటన మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇదే సెట్ లో రామ్ చరణ్ పై కూడా కొన్ని కీలక సన్నివేశాలను తీయడానికి కొరటాల శివ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది. ఆమె వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆచార్య’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం చిరంజీవి అయితే రెండో కారణం కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన పరాజయం అంటూ ఎరుగడు. ఇక ఈ సినిమా టీజర్ పై గతకొంత కాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ కానున్నదని సమాచారం.
Mustb Read ;- మెగాస్టార్ తో ఆడిపాడేందుకు ఎవరూ ఉండారా?
https://www.youtube.com/watch?v=ct_jT3vBHyU











