పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. పవన్ ఒక సినిమా తర్వాత మరో సినిమా కాకుండా… వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్.. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ తో సినిమా చేస్తున్నారు. ఎ.ఎం.రత్నం నిర్మాణంలో పాన్ ఇండియా కేటగిరిలో సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పారు. అలాగే సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలా యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్రతో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ ఒకటి వచ్చింది. పవన్ కళ్యాణ్… వకీల్ సాబ్ తర్వాత జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ లోనే జాయిన్ కానున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కూడా సినిమా చేసేందుకు పవన్ ఓకే చెప్పారని.. ఈ మూవీని రామ్ చరణ్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… స్టార్ రైటర్ కోన వెంకట్ పవన్ కళ్యాణ్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నారట. కోన వెంకట్ కి పవన్ తో మంచి అనుబంధం ఉంది. రాజకీయంగా కోన వెంకట్.. పవన్ తో ఏకీభవించకపోయినా వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉంది. ఎప్పటి నుంచో పవన్ తో సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఇటీవల పవన్ కి కోన కథ చెబితే ఓకే చెప్పారని తెలిసింది.
అయితే.. ఈ మూవీని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ తో గబ్బర్ సింగ్ మూవీ నిర్మించిన తర్వాత మళ్లీ సినిమా చేయాలి అనుకున్నారు బండ్ల గణేష్. పవన్ కూడా బండ్ల గణేష్ బ్యానర్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ మూవీలో పవర్ స్టార్ లెక్చరర్ గా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఇప్పటికే పవన్ ఓకే చెప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. అందుచేత.. ఈ మూవీ కన్ ఫర్మ్ అయినా.. సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా టైమ్ పట్టచ్చు.
Also Read: 2021 సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రానా సినిమా