మంత్రి అప్పలరాజు తీరుపై పోలీసులు అసంతృప్తి!
సీఎం జగన్ రెడ్డి విశాఖ లో బుధవారం పర్యటించారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారదా పీఠానికి తన అనుచరులతో మంత్రి సీదిరి అప్ప లరాజువెళ్లారు. ఈ క్రమంలో అక్కడ అరిలోవ సీఐ రాజుల నాయుడు తన సిబ్బందితో విధులు నిర్వర్తిస్తున్నారు. మంత్రి సీదిరి లోపలి ప్రవేశిస్తున్న సమయంలో సీఎం రాజుల నాయుడు అడ్డుకున్నారు. ‘‘మంత్రికి మాత్రమే అనుమతి ఉందని, అనుచరులకు లేదని చెప్పారు. తమపై అధికారులు ఆదేశాల మేరకు డ్యూటీ చేస్తున్నామని చెప్పారు!’’ దీంతో ఆగ్రహించిన మంత్రి సీదిరి సీఐ నోటి కొచ్చినట్లు పరుష పదజాలంతో తిట్టి, దూరంగా నెట్టివేశాడు. దీంతో పోలీసులు సద్ది చెప్పి.. మంత్రిని కాంప్రమైజ్ చేయాలని చూసినా.. ఆయన వినలేదు. తనకు తీవ్ర అవమానం జరిగిందని, సీఐ తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ గా మాట్లాడారు. దీంతో పోలీసుల పట్ల మంత్రి వ్యవహరించిన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనిని అవమానంగా ఫీల్ అయిన మంత్రి సీదిరి అనుచరులతో తిరిగి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
అవమానమా? అహంకారమా??
విశాఖ శ్రీ శారదా మాత సాక్షిగా మంత్రి సీదిరి అప్పరాజుకు నిజంగా అవమానం జరిగిందా? లేక బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్న సీఐ రాజులు నాయుడుకు అవమానం జరిగిందా? అని పరిశీలిస్తే.. వందకు వంద శాతం మంత్రి చేసింది తప్పు, సీఐకే తీవ్ర అవమానం జరిగింది అన్నది స్పష్టం తెలుస్తోంది! ఒక కెబినెట్ మినిస్టర్ కు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన మర్యాదలు, భద్రత, సౌకర్యాలు కల్పించడం పోలీసుల బాధ్యత! అయితే ప్రభుత్వం, ఉన్నతాధికారులు, హోంశాఖ ఏం చెబితే అది గుడ్డిగా ఫాలో కావాల్సిందేనని సర్వీస్ రూల్ పోలీసులకు చెబుతోంది. దీనినే ఫాలో అయ్యాడు సీఐ రాజులు నాయుడు! అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్, ఆయన పూజలు చేస్తున్న మందిరంలో ఇరుకుగా ఉంటుంది. అక్కడికి మంత్రులు, ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు తప్ప.. వేరేవారికి అనుమతి లేదని సీఎంవో ఆఫీస్ నుంచి ఆదేశాలున్నాయి! దీనినే అమలు చేస్తూ.. సీఐ విధులు నిర్వహించారు! కానీ వాటిని గమనించుకోకుండా.. మంత్రి అనేక గర్వంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తిచడమేకాక, విధి నిర్వహణలో ఉన్న పోలీసుల అధికారిని నా.. డకా అంటూ తిట్టడమేకాక, దాడి చేశాడు సీదిరి! ఇటువంటి చర్యలను సహించేదే లేదని మంత్రిపై ప్రజలు, సోషల్ మీడియా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా మంత్రి సీదిరి చర్యలను రాష్ట్ర ప్రజలు ఖండిస్తుంటే.. పోలీసు సంఘాలు, డీజీపీ, విశాఖ సిటీ కమిషనర్, హోంమంత్రి దీనిపై స్పందించకపోవడం గమనార్హం!
Must Read:-టీడీపీపై ఏపీ డీజీపీ కక్ష్య |











